ప్రపంచకప్ మహిళా సాకర్ సెమీస్ లో ఇంగ్లండ్

  • క్వార్టర్ ఫైనల్లో నార్వేపై 3-0 విజయం

ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 2019 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ సెమీఫైనల్స్ కు ఇంగ్లండ్ వరుసగా రెండోసారి చేరుకొంది.

తొలి క్వార్టర్ ఫైనల్లో మాజీచాంపియన్ నార్వేను ఇంగ్లండ్ 3-0 గోల్స్ తో చిత్తు చేసి…టైటిల్ ఫేవరెట్ గా సెమీస్ లో అడుగుపెట్టింది.

ఇతర క్వార్టర్ ఫైనల్స్ పోటీలలో ఇటలీతో హాలెండ్, అమెరికాతో ఫ్రాన్స్, జర్మనీతో స్వీడన్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 16 జట్ల ఈ టోర్నీ లో ఎనిమిది క్వార్టర్ ఫైనల్స్ స్థానాలలో ఏడింటిని యూరోప్ జట్లే సొంతం చేసుకోడం విశేషం.

క్వార్టర్స్ బెర్త్ లు సాధించిన యూరోప్ జట్లలో జర్మనీ, స్వీడన్, హాలెండ్, ఇటలీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్, నార్వే ఉన్నాయి. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల జట్ల పోటీ లీగ్ దశ లోనే ముగియటం చూస్తే…యూరోప్ జట్ల ఆధిపత్యం ఏపాటిదో మరి చెప్పాల్సిన పనిలేదు.