దర్శకుడు ఏఎల్ విజయ్ రెండో పెళ్లి

మొన్నటివరకు కేవలం సినిమాలో లేకంగా బతికిన దర్శకుడు ఏఎల్ విజయ్ ఇప్పుడు మరోసారి తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టాడు. త్వరలోనే ఈ దర్శకుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. మన్నివన్నన్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే డైక్టర్ తో విజయ్ వివాహం జరగబోతోంది. జులై 11న చెన్నైలో వీళ్ల వివాహం జరుగుతుంది.

గతంలో హీరోయిన్ అమలాపాల్, ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీళ్ల బంధం ఎక్కువరోజులు కొనసాగలేదు. కుటుంబంలో గొడవలు మొదలవ్వడంతో ముందుగా అమలాపాలే బ్రేకప్ చెప్పేసింది. తర్వాత ఇద్దరూ అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. ఇది జరిగిన మూడేళ్లకు ఏఎల్ విజయ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను సినిమాగా తీసే పనిలో బిజీగా ఉన్నాడు. కంగనారనౌత్ ఇందులో లీడ్ రోల్ పోషించబోతోంది. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఏఎల్ విజయ్. ఇది ప్రేమపెళ్లి కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లని స్వయంగా విజయ్ ప్రకటించాడు.