మణిశర్మ ఇలా కాపీకొట్టేశాడేంటి?

మణిశర్మకు మెలొడీ బ్రహ్మ అనే బిరుదు ఉంది. ఎందుకంటే, అతడు తన ప్రతి సినిమాకు ఓ మంచి మెలొడీ ఇస్తాడు కాబట్టి. అలాంటి బిరుదు పెట్టుకున్న ఈ సంగీత దర్శకుడు, పక్క సినిమా నుంచి ఓ మెలొడీ సాంగ్ ను కాపీకొట్టేస్తాడని ఊహించగలమా? కానీ అదే జరిగింది.

అవును.. మణిశర్మ కాపీ కొట్టాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఈరోజు విడుదలైన సాంగ్ వింటే ఎవరైనా ఇది కాపీ అనే విషయాన్ని గుర్తుపట్టేస్తారు. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అజయ్ దేవగన్ హీరోలుగా నటించిన 2 సినిమాల్లోని ట్యూన్స్ ను ఇలా మిక్స్ చేసి ‘ఉండిపో’ అనే సాంగ్ ను కంపోజ్ చేశాడు మణిశర్మ.

పైన చెప్పిన బాలీవుడ్ సాంగ్స్ విని, ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లోని ఈ ‘ఉండిపో’ అనే పాట వింటే ఎవరైనా ఈ విషయాన్ని ఈజీగా గుర్తుపట్టేస్తారు. మెలొడీలకు పెట్టింది పేరైన మణిశర్మ ఇలా ట్యూన్ కాపీకొట్టడం ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.