బీరు తాగింది… సినిమా ఆఫర్ పోయింది…

హాట్ బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే…. తన సినిమాలతో కాక….. వివాదాస్పద కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తెలుగులో ‘లెజెండ్’, ‘రక్త చరిత్ర’ వంటి సినిమాలో కనిపించిన ఈమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరు.

మరోవైపు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘విక్కీ డోనర్’ సినిమా బాలీవుడ్ లో హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో యామి గౌతం హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాధికా ఆప్టే.

సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందు తనను ఎంపిక చేశారట. అయితే సినిమా షూటింగ్ మొదలు కావడానికి కొన్ని రోజులు ఉండటంతో ఆమె విహారయాత్రకు వెళ్లిందట.

“అక్కడ బాగా తిని, బీర్లు కూడా ఎక్కువగా తాగడం తో కొంచెం బరువు కూడా పెరిగి పోయాను. షూటింగ్ ప్రారంభం అయ్యే సమయానికి నేను లావుగా ఉండటం తో నన్ను సినిమా నుంచి తొలగించారు. కాస్త సమయం ఇస్తే నేను కచ్చితంగా బరువు తగ్గి చూపిస్తానని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వారు వినిపించుకోలేదు. మంచి సినిమా కోల్పోయానని బాధ నాకు లేదు… ఎందుకంటే అంతకు మించి మంచి సినిమాలు వస్తాయనే నమ్మకం నాకు ఉంది. కానీ బీర్లు తాగాననే నెపంతో వాళ్లు నన్ను సినిమా నుంచి తొలగించడం నన్ను చాలా బాధించింది” అని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.