స్టైలిష్ డాన్ పాత్రలో శర్వానంద్

యువ హీరో శర్వానంద్ ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సారి ఎలాగైనా ఒక మంచి హిట్ అందుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న శర్వానంద్… సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమా తో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ సినిమాలో శర్వా ఒక గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇవాళ ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. గుబురు గడ్డంతో గన్ పేలుస్తూ శర్వా ఒక స్టైలిష్ డాన్ అవతారంలో దర్శనమిచ్చాడు.

90 ల బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవుడిని నమ్మాలంటే భక్తి చాలు…. కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి వంటి డైలాగులు అదిరిపోయాయి. టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.