Telugu Global
NEWS

ప్రపంచకప్ లో తేనెటీగల గోల

సౌతాఫ్రికా- శ్రీలంక జట్ల మ్యాచ్ కు అనుకోని అతిథులు ఆట మాని గ్రౌండ్లోనే బోర్లాపడిన క్రికెటర్లు ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా…చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శ్రీలంక- సౌతాఫ్రికా జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ కు అనుకోని అతిథులు రావడంతో కొద్ది క్షణాలపాటు ఆటగాళ్లు , ఫీల్డ్ అంపైర్లు భయభ్రాంతులకు గురయ్యారు. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆట 48వ ఓవర్ ప్రారంభంలోనే తేనెటీగల దండు ఒక్కసారిగా గ్రౌండ్ లోకి దండెత్తి […]

ప్రపంచకప్ లో తేనెటీగల గోల
X
  • సౌతాఫ్రికా- శ్రీలంక జట్ల మ్యాచ్ కు అనుకోని అతిథులు
  • ఆట మాని గ్రౌండ్లోనే బోర్లాపడిన క్రికెటర్లు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా…చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శ్రీలంక- సౌతాఫ్రికా జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ కు అనుకోని అతిథులు రావడంతో కొద్ది క్షణాలపాటు ఆటగాళ్లు , ఫీల్డ్ అంపైర్లు భయభ్రాంతులకు గురయ్యారు.

శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆట 48వ ఓవర్ ప్రారంభంలోనే తేనెటీగల దండు ఒక్కసారిగా గ్రౌండ్ లోకి దండెత్తి రావడంతో ఫీల్డ్ అంపైర్లు.. ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. శ్రీలంక బ్యాట్స్ మన్ తో పాటు సౌతాఫ్రికా ఫీల్డర్లను జాగ్రత్త జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

దీంతో శ్రీలంక టెయిల్ ఎండర్లు.. ఇసురు ఉడానా, సురంగ లక్మాల్ లతో పాటు…బౌలర్ క్రిస్ హారిస్ సైతం ఫీల్డ్ లోనే బొక్కబోర్లా పడుకొని బ్రతుకు జీవుడా అంటూ గడిపారు.

చెస్టర్ లీ స్ట్రీట్ స్టేడియం స్టాండ్స్ లోని ప్రేక్షకులు సైతం ఒక్కసారిగా ఎలర్టయ్యారు.

సాధారణంగా క్రికెట్ ఫీల్డ్ లోకి శునకాలు, పావురాలు, కాకులు, పెంపుడు కుక్కలు, సీగల్స్ లాంటి పక్షలు అనుకోని అతిథులుగా రావడం సాధారణ విషయమే.

అయితే…నదీతీరాన్నే ఆనుకొని ఉన్న అందాల చెస్టర్ -లీ- స్ట్రీట్ స్టేడియంలోకి మాత్రం అమృతం లాంటి తేనేను అందించే తేనేటీగలు రావడం విశేషంగా మారింది.

First Published:  28 Jun 2019 10:10 PM GMT
Next Story