Telugu Global
Cinema & Entertainment

బిగ్‌బాస్ 3 లో శ్రీముఖి, టీవీ9 యాంక‌ర్ !

బిగ్‌బాస్ సీజ‌న్ 3 జులై 18 నుంచి ప్రారంభం కాబోతుంది. వాల్డ్‌క‌ప్ జులై 16తో ముగుస్తోంది. వాల్డ్‌క‌ప్ ముగిసిన రెండు రోజుల త‌ర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌3 ప్రారంభం కాబోతుంది. ఇప్ప‌టికే హోస్ట్‌గా నాగార్జున ఖ‌రారు అయ్యారు. తొలి రెండు సీజ‌న్‌ల‌కు ఎన్టీఆర్‌,నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు,. తొలి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజ‌న్ కాంట్రావ‌ర్సీగా మారింది. దీంతో మూడో సీజ‌న్‌లో పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు ఉంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్‌బాస్ 3లో ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖి ఓపార్టిసిపెంట్ సెల‌క్ట్ […]

బిగ్‌బాస్ 3 లో శ్రీముఖి, టీవీ9 యాంక‌ర్ !
X

బిగ్‌బాస్ సీజ‌న్ 3 జులై 18 నుంచి ప్రారంభం కాబోతుంది. వాల్డ్‌క‌ప్ జులై 16తో ముగుస్తోంది. వాల్డ్‌క‌ప్ ముగిసిన రెండు రోజుల త‌ర్వాత బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్‌3 ప్రారంభం కాబోతుంది. ఇప్ప‌టికే హోస్ట్‌గా నాగార్జున ఖ‌రారు అయ్యారు. తొలి రెండు సీజ‌న్‌ల‌కు ఎన్టీఆర్‌,నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు,.

తొలి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజ‌న్ కాంట్రావ‌ర్సీగా మారింది. దీంతో మూడో సీజ‌న్‌లో పార్టిసిపెంట్స్ ఎవ‌రెవ‌రు ఉంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్‌బాస్ 3లో ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖి ఓపార్టిసిపెంట్ సెల‌క్ట్ అయ్యారు. ఆమెకు బాగానే రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం కోస‌మే ఆమె ప‌టాస్‌కు గుడ్‌బై చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఆమెతో పాటు టీవీ9లో ముఖాముఖి కార్య‌క్ర‌మం ద్వారా ఫేమ‌స్ అయిన జాఫ‌ర్ కూడా ఈసారి బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నాడు. ఈయ‌న‌తో పాటు తీన్మార్ వార్త‌ల‌తో ఫేమ‌స్ అయిన వీ6 సావిత్రి కూడా ఈ సీజ‌న్‌లో పార్టిసిపెట్ చేస్తుంది.

హీరో త‌రుణ్‌, కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు, సింగ‌ర్స్ హేమ‌చంద్ర‌, రాహుల్‌, మహాత‌ల్లి ఫేమ‌స్ జాహ్న‌వి, వైవా హ‌ర్ష ఈ సీజ‌న్‌లో ఉంటార‌ని తెలుస్తోంది.

ఇక పోతే హీరో త‌రుణ్‌, యాంక‌ర్ ఉద‌య‌భాను, యాంక‌ర్ లాస్య‌, ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ కూడా ఈ సీజ‌న్‌లో పాల్గొనేందుకు ఆస‌క్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బిగ్‌బాస్ ఏజెన్సీ మాత్రం 30 మందిని ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. వీరిలో 16 మంది మాత్రమే పాల్గొంటారు. ఇప్ప‌టివ‌ర‌కూ న‌లుగురు ఐదుగురికి మాత్రమే ప‌క్కాగా పాల్గొంటారని చెప్పిన‌ట్లు స‌మాచారం. వీరిలో మ‌రికొంద‌రిని ఇంకా క‌న్ఫ‌మ్ చేయాల్సి ఉంది.

First Published:  29 Jun 2019 10:03 PM GMT
Next Story