Telugu Global
National

మార్కెట్ లోకి గ్యాస్‌ ఇస్త్రీ పెట్టె... దీని ధర...

భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ – బీపీసీఎల్ కొత్త రకం ఇస్త్రీ పెట్టెను మార్కెట్‌లోకి విడుదల చేసింది. న్యూటెక్ సంస్థ సాయంతో తయారు చేసిన ఈ ఇస్ట్రీ పెట్టెను విజయవంతంగా పరీక్షించారు. 6.5 కేజీల బరువుండే ఈ ఇస్త్రీ పెట్టెతో అత్యంత వేగంగా ఇస్త్రీ చేయవచ్చు. ఐదు కేజీల గ్యాస్‌ సిలిండర్‌కు అనుసంధానం చేసి గ్యాస్‌ ఆధారితంగా ఇది పనిచేసేలా తయారు చేశారు. రెండు నిమిషాల్లో గరిష్ట స్థాయిలో వేడిని ఇది అందుకుంటుంది. వేడి అయిన తర్వాత […]

మార్కెట్ లోకి గ్యాస్‌ ఇస్త్రీ పెట్టె... దీని ధర...
X

భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్ – బీపీసీఎల్ కొత్త రకం ఇస్త్రీ పెట్టెను మార్కెట్‌లోకి విడుదల చేసింది. న్యూటెక్ సంస్థ సాయంతో తయారు చేసిన ఈ ఇస్ట్రీ పెట్టెను విజయవంతంగా పరీక్షించారు. 6.5 కేజీల బరువుండే ఈ ఇస్త్రీ పెట్టెతో అత్యంత వేగంగా ఇస్త్రీ చేయవచ్చు.

ఐదు కేజీల గ్యాస్‌ సిలిండర్‌కు అనుసంధానం చేసి గ్యాస్‌ ఆధారితంగా ఇది పనిచేసేలా తయారు చేశారు. రెండు నిమిషాల్లో గరిష్ట స్థాయిలో వేడిని ఇది అందుకుంటుంది. వేడి అయిన తర్వాత గ్యాస్‌ సరఫరా ఆపేసినా గంట పాటు వేడిగానే ఉంటుంది.

ఐదుకేజీల సిలిండర్‌ గ్యాస్‌తో వారం రోజుల పాటు నిరంతరాయంగా ఇస్త్రీ చేసుకోవచ్చని బీపీసీఎల్ చెబుతోంది. పేలుడు, అగ్ని ప్రమాదాలు వంటి ముప్పు లేకుండా అత్యంత సురక్షితంగా దీన్ని తయారు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఇస్త్రీ పెట్టె, గ్యాస్ సిలిండర్‌, రెగ్యులేటర్‌, ట్యూబ్ అన్నీ కలిపి ఈ ఇస్త్రీ పెట్టె ధర ఆరు వేలుగా నిర్ణయించారు.

First Published:  30 Jun 2019 3:29 AM GMT
Next Story