Telugu Global
Cinema & Entertainment

రాజమౌళీ... ఆ సినిమా చూడు!

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా విడుదల అయిన తొలి రోజు నుండే ఎన్నో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికీ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడు పరిశ్రమ లో ఉన్న పెద్దలు కూడా చాలా మంది సినిమా ని చూసి అభినందిస్తున్నారు. అందులో భాగం గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఈ సినిమా ని చూసి సినిమా యూనిట్ ని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు. అయితే ఈ […]

రాజమౌళీ... ఆ సినిమా చూడు!
X

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా విడుదల అయిన తొలి రోజు నుండే ఎన్నో పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికీ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

ఈ తరుణంలో ఇప్పుడు పరిశ్రమ లో ఉన్న పెద్దలు కూడా చాలా మంది సినిమా ని చూసి అభినందిస్తున్నారు. అందులో భాగం గా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఈ సినిమా ని చూసి సినిమా యూనిట్ ని ప్రత్యేకంగా పిలిపించుకొని అభినందించారు.

అయితే ఈ సినిమా లో హీరో గా పని చేసిన నవీన్ పోలిశెట్టి ని ప్రత్యేకంగా అభినందించాడు రాఘవేంద్ర రావు. అలాగే మాట్లాడుతూ తన శిష్యుడు అయిన రాజమౌళి ని కూడా ఈ సినిమా చూడమని చెప్పారు.

“ఈ సినిమా చూసాను. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చాలా బాగుంది. ఏజెంట్ ఆత్రేయ గా చేసిన నవీన్ పోలిశెట్టి బాగా నటించాడు. మొదటి సినిమా అయినా కానీ మంచి అనుభవం ఉన్న నటుడిగా పని చేసాడు. ఇంకా ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటె, వెంటనే వెళ్లి ఈ సినిమా ని చూడండి. అలాగే రాజమౌళీ.. నువ్వు కూడా ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడు” అని ఆయన అన్నారు.

First Published:  30 Jun 2019 2:07 AM GMT
Next Story