Telugu Global
Cinema & Entertainment

సుకుమార్ కథ ని హోల్డ్ లో పెట్టిన దేవరకొండ !

క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా పరిశ్రమ లో పేరు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. రంగస్థలం లాంటి పెద్ద విజయం సాధించాక కూడా ఇంకా కొత్త సినిమా ఏమీ మొదలుపెట్టలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు సుకుమార్ నుండి అధికారిక ప్రకటన ఏమి రాలేదు. మొదటగా మహేష్ బాబు తో సినిమా చేయాల్సి ఉన్నా… మహేష్ కి, సుకుమార్ కి మధ్య కొన్ని విభేదాలు రావడం తో ఈ సినిమా ని చేయడం లేదని మహేష్ ప్రకటించాడు. ఆ […]

సుకుమార్ కథ ని హోల్డ్ లో పెట్టిన దేవరకొండ !
X

క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు సినిమా పరిశ్రమ లో పేరు సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్. రంగస్థలం లాంటి పెద్ద విజయం సాధించాక కూడా ఇంకా కొత్త సినిమా ఏమీ మొదలుపెట్టలేదు.

అయినప్పటికీ ఇప్పటి వరకు సుకుమార్ నుండి అధికారిక ప్రకటన ఏమి రాలేదు. మొదటగా మహేష్ బాబు తో సినిమా చేయాల్సి ఉన్నా… మహేష్ కి, సుకుమార్ కి మధ్య కొన్ని విభేదాలు రావడం తో ఈ సినిమా ని చేయడం లేదని మహేష్ ప్రకటించాడు.

ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ సుకుమార్ ని పక్కన పెట్టిన అల్లు అర్జున్…. వేణు శ్రీరామ్ కి ఓకే చెప్పాడు.

ఇప్పుడు తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు సుకుమార్ విజయ్ దేవరకొండ కి ఒక కథ చెప్పాడట. విజయ్ కూడా స్టార్ డైరెక్టర్స్ తో పని చేయాలని చూస్తూ ఉండటం తో సుకుమార్ కథ ని విన్నాడట…. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక సమాచారం అయితే ఏమి బయటకు రాలేదు. ఇకపోతే ఈ సినిమా మొదలవుతుందా? లేదా? అనేది సస్పెన్స్.

First Published:  30 Jun 2019 2:31 AM GMT
Next Story