Telugu Global
Cinema & Entertainment

తమన్న స్థానంలో మరో బ్యూటీ

రాజుగారి గది-3 నుంచి తమన్న అకస్మాత్తుగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ ఆఫర్ రావడంతో ఆమె అటు జంప్ అయింది. ఇప్పుడా స్థానాన్ని మరో నటితో భర్తీచేయనున్నారు. ఆమె మరెవరో కాదు తాప్సి. హారర్, థ్రిల్లర్ సినిమాలు చేయడంలో తమన్న, తాప్సి ఒకర్నొకరు పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో తమన్న కంటే తాప్సి ఓ అడుగు ముందే ఉంటుంది. అందుకే తమన్న తప్పుకున్న వెంటనే తాప్సిని సంప్రదించారు మేకర్స్. ప్రస్తుతం ఓ హిందీ, ఓ […]

తమన్న స్థానంలో మరో బ్యూటీ
X

రాజుగారి గది-3 నుంచి తమన్న అకస్మాత్తుగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ ఆఫర్ రావడంతో ఆమె అటు జంప్ అయింది. ఇప్పుడా స్థానాన్ని మరో నటితో భర్తీచేయనున్నారు. ఆమె మరెవరో కాదు తాప్సి.

హారర్, థ్రిల్లర్ సినిమాలు చేయడంలో తమన్న, తాప్సి ఒకర్నొకరు పోటీపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో తమన్న కంటే తాప్సి ఓ అడుగు ముందే ఉంటుంది. అందుకే తమన్న తప్పుకున్న వెంటనే తాప్సిని సంప్రదించారు మేకర్స్.

ప్రస్తుతం ఓ హిందీ, ఓ తమిళ ప్రాజెక్టుతో బిజీగా ఉంది తాప్సి. కాకపోతే రాజుగారి గది-3 కాన్సెప్ట్ నచ్చితే మాత్రం ఆమె తప్పకుండా చేస్తుంది. ప్రస్తుతం దర్శకుడు ఓంకార్ అదే పనిలో ఉన్నాడు. తమన్న తప్పుకున్నప్పటికీ, తాప్సి ఒప్పుకుంటే ఈ సినిమాకు అదే క్రేజ్ కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

ప్రస్తుతం మూవీకి సంబంధించి అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూట్ చేస్తున్నారు. హీరో అశ్విన్, మరికొంతమంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య సన్నివేశాలు తీస్తున్నారు. హీరోయిన్ ఓకే అంటే, సినిమా షూటింగ్ వేగం పుంజుకుంటుంది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

First Published:  30 Jun 2019 7:10 AM GMT
Next Story