Telugu Global
NEWS

టీడీపీ కార్యాలయానికీ నోటీసులు

ఏపీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాల్లో ఉన్న అక్రమ కట్టడాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో విశాఖలో నిర్మించిన టీడీపీ కార్యాలయానికి కూడా జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే టీడీపీ ఈ కార్యాలయాన్ని నిర్మించింది. వివాదాస్పద దసపల్లా భూముల్లో మూడువేల చదరపు గజాల్లో ఈ కార్యాలయం నిర్మించారు. తొలుత రెండువేల చదరపు గజాలను మాత్రమే ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నప్పటికీ అధికారం […]

టీడీపీ కార్యాలయానికీ నోటీసులు
X

ఏపీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాల్లో ఉన్న అక్రమ కట్టడాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో విశాఖలో నిర్మించిన టీడీపీ కార్యాలయానికి కూడా జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే టీడీపీ ఈ కార్యాలయాన్ని నిర్మించింది.

వివాదాస్పద దసపల్లా భూముల్లో మూడువేల చదరపు గజాల్లో ఈ కార్యాలయం నిర్మించారు. తొలుత రెండువేల చదరపు గజాలను మాత్రమే ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నప్పటికీ అధికారం అడ్డుపెట్టుకుని మరో వెయ్యి చదరపు గజాల భూమిని పక్కనే ఉన్న కొండను తొలచి ఆక్రమించారు. ఈ భూమి తమదంటే తమదంటూ రాణి కమలాదేవికి, ప్రభుత్వానికి మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది.

అయినప్పటికీ టీడీపీ ఈ భూమిని అధికార బలంతో ప్రభుత్వం నుంచి తీసుకుని భవనం కట్టేసింది. స్థలానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లను చూపించాలని లేని పక్షంలో భవనాన్ని కూల్చివేస్తామని జీవీఎంసీ అధికారులు ప్రకటించారు. రాణి కమలాదేవి పేరుతో ఉన్న లింక్ డాక్యుమెంట్లు వారంలోగా ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. లేదంటే కూల్చివేత తప్పదని నోటీసుల్లో స్పష్టం చేశారు.

First Published:  29 Jun 2019 9:24 PM GMT
Next Story