Telugu Global
Cinema & Entertainment

అంతలోనే మరో సినిమా

కొత్త హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకురారు. ఫస్ట్ మూవీతో ముందు నిరూపించుకున్న తర్వాతే సినిమా ఛాన్సులు వస్తాయి. కానీ విజయ్ దేవరకొండ తమ్ముడితో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఎగబడుతున్నారు. ఓవైపు దొరసాని సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరోవైపు అతడితో సినిమా చేసేందుకు ఓ ప్రొడక్షన్ హౌజ్ ఆసక్తి చూపిస్తోంది. వినోద్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు ఆనంద్ దేవరకొండ. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండకు ఓ […]

అంతలోనే మరో సినిమా
X

కొత్త హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకురారు. ఫస్ట్ మూవీతో ముందు నిరూపించుకున్న తర్వాతే సినిమా ఛాన్సులు వస్తాయి. కానీ విజయ్ దేవరకొండ తమ్ముడితో సినిమాలు చేసేందుకు మేకర్స్ ఎగబడుతున్నారు. ఓవైపు దొరసాని సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగానే మరోవైపు అతడితో సినిమా చేసేందుకు ఓ ప్రొడక్షన్ హౌజ్ ఆసక్తి చూపిస్తోంది.

వినోద్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు ఆనంద్ దేవరకొండ. ఈ దర్శకుడు విజయ్ దేవరకొండకు ఓ కథ చెప్పాడు. ఆ స్టోరీలో తన కంటే తన తమ్ముడైతే బాగుంటుందని, ఆనంద్ వద్దకు పంపించాడట విజయ్. అలా ప్రాజెక్టు సెట్ అయింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

జులైలో దొరసాని సినిమా రిలీజ్ అవుతుంది. అది థియేటర్లలోకి వచ్చిన వెంటనే వినోద్ – ఆనంద్ దేవరకొండ సినిమా లాంఛ్ అవుతుంది. ఇందులో కూడా ఆనంద్ దేవరకొండ సరసన ఓ కొత్తమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

First Published:  30 Jun 2019 7:02 PM GMT
Next Story