Telugu Global
National

ఆర్థిక రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు

భారత ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అంధేరీ సబ్‌వేలో నీరు భారీగా చేరడంతో బీఎంసీ సిబ్బంది పైపులు ఉపయోగించి నీళ్లు తొలగిస్తున్నారు. ఇక కుర్లా సీఎస్టీ […]

ఆర్థిక రాజధానిని ముంచెత్తిన భారీ వర్షాలు
X

భారత ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అంధేరీ సబ్‌వేలో నీరు భారీగా చేరడంతో బీఎంసీ సిబ్బంది పైపులు ఉపయోగించి నీళ్లు తొలగిస్తున్నారు. ఇక కుర్లా సీఎస్టీ రోడ్డు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా సోమవారం కావడంతో ట్రాఫిక్ భారీగా జాం అయ్యింది.

అర్థరాత్రి దాటిన తర్వాత వర్షం తీవ్రత పెరగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గింది. అంతే కాకుండా జంబుర్గ్ – థాకూర్‌వాడీ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ముంబై నుంచి బయలుదేరాల్సిన పలు రైళ్లను రద్దు చేశారు.

First Published:  1 July 2019 12:20 AM GMT
Next Story