Telugu Global
Cinema & Entertainment

అప్పుడు చైతుతో.... ఇప్పుడు నాగార్జునతో....

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్ర లో వచ్చే ఏడాది జనవరి చివరికల్లా బంగార్రాజు అనే సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ భావిస్తోంది. గతం లో విడుదల అయిన సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా కి రెండో భాగం గా ఈ బంగార్రాజు అనే సినిమా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో షూటింగ్ మొదలు […]

అప్పుడు చైతుతో.... ఇప్పుడు నాగార్జునతో....
X

నాగార్జున అక్కినేని ప్రధాన పాత్ర లో వచ్చే ఏడాది జనవరి చివరికల్లా బంగార్రాజు అనే సినిమా ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ భావిస్తోంది.

గతం లో విడుదల అయిన సోగ్గాడే చిన్ని నాయన అనే సినిమా కి రెండో భాగం గా ఈ బంగార్రాజు అనే సినిమా విడుదల అవుతుంది. అయితే ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలో షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమా కి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతుంది.

అయితే ఈ సినిమా లో నాగ చైతన్య సరసన కీర్తి సురేష్ నటిస్తుంది అనే వార్తలు మనం వింటూ నే ఉన్నాము. కాకపోతే ఆసక్తికర అంశం ఏంటి అంటే నాగార్జున సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా చేసే అవకాశాలు ఉన్నాయి అని టాక్ నడుస్తుంది.

చైతన్య తో ఒక లైలా కోసం సినిమా లో నటించిన పూజ ఇప్పుడు నాగార్జున పక్కన చేస్తే ఎలా ఉంటుంది అనేది కీలకం గా మారింది. పైగా 59 ఏళ్ళ నాగార్జున పక్కన 28 ఏళ్ళ పూజ జోడీ బాగుంటుందా లేదా అనే దాని పైన చర్చలు జరుగుతున్నాయి.

First Published:  1 July 2019 4:53 AM GMT
Next Story