Telugu Global
Cinema & Entertainment

పర్సనల్ టీమ్ మీద ప్రేమ కురిపిస్తున్న శ్రద్ధ

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ ‘సాహో’ టీం కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఫోటో మరియు మెసేజ్ ను షేర్ చేసింది. తన హెయిర్ డ్రెస్సర్ కి, మేకప్ ఆర్టిస్ట్ మరియు తదితరులకు కృతజ్ఞతలు చెబుతూ […]

పర్సనల్ టీమ్ మీద ప్రేమ కురిపిస్తున్న శ్రద్ధ
X

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ త్వరలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ ‘సాహో’ టీం కి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఫోటో మరియు మెసేజ్ ను షేర్ చేసింది. తన హెయిర్ డ్రెస్సర్ కి, మేకప్ ఆర్టిస్ట్ మరియు తదితరులకు కృతజ్ఞతలు చెబుతూ వారితో దిగిన ఫోటోలు షేర్ చేసింది.

“వీళ్ళందరూ నాకు చాలా స్పెషల్. వీరిని కలిసినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని” అంటూ శ్రద్ధ కపూర్ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది.

ఇక జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, నీల్ నితిన్ ముకేశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15 న విడుదల కాబోతోంది. యువి క్రియేషన్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి.

First Published:  1 July 2019 12:39 AM GMT
Next Story