Telugu Global
NEWS

బూతు కోటికి బీజేపీ కండువా

ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను బదనాం చేయడంలో టీడీపీ వాడిన పావుల్లో కోటి ఒకడు. చంద్రబాబు గతాన్ని లక్ష్మీపార్వతి తవ్వి మరీ అందరికీ తెలియజేస్తుండడంతో ఆమెను కట్టడి చేయడానికి కోటిని ప్రయోగించారు. ఇతగాడు ఆమె వద్ద నమ్మకంగా చేరి ఒకరోజు ఆమె ఫోన్ నుంచి తన ఫోన్‌కు కొన్ని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుకుని తనను ఆమె వేధిస్తోందంటూ కేసు పెట్టాడు. అవ్వ వయసున్న మహిళపై ఈ నిందలేంటి అని సమాజం ఆశ్చర్యపోయింది. ఈ వ్యవహారం హైదరాబాద్‌లో జరిగితే కోటి.. […]

బూతు కోటికి బీజేపీ కండువా
X

ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను బదనాం చేయడంలో టీడీపీ వాడిన పావుల్లో కోటి ఒకడు. చంద్రబాబు గతాన్ని లక్ష్మీపార్వతి తవ్వి మరీ అందరికీ తెలియజేస్తుండడంతో ఆమెను కట్టడి చేయడానికి కోటిని ప్రయోగించారు.

ఇతగాడు ఆమె వద్ద నమ్మకంగా చేరి ఒకరోజు ఆమె ఫోన్ నుంచి తన ఫోన్‌కు కొన్ని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుకుని తనను ఆమె వేధిస్తోందంటూ కేసు పెట్టాడు. అవ్వ వయసున్న మహిళపై ఈ నిందలేంటి అని సమాజం ఆశ్చర్యపోయింది.

ఈ వ్యవహారం హైదరాబాద్‌లో జరిగితే కోటి.. టీడీపీ నేతలు, కొందరు మీడియా పెద్దల డైరెక్షన్‌లో కేసు మాత్రం గుంటూరు జిల్లా వినుకొండలో పెట్టాడు. కారణం అప్పటికి ఇంకా ఏపీలో చంద్రబాబు జమానా నడుస్తోంది కాబట్టి.

అయితే లక్ష్మీపార్వతి హైదరాబాద్‌ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు అసలు విషయం బయటకు తెచ్చారు. లక్ష్మీపార్వతి ఫోన్ నుంచి కోటి ఫోన్‌కు మేసేజ్‌లు వెళ్లిన సమయంలో రెండు ఫోన్లు దాదాపు ఒకే చోట, ఒకే టవర్‌ పరిధిలో ఉన్నట్టు తేల్చారు. దాంతో కోటి కుట్ర బయటపడింది.

అప్పటి నుంచి కోటి పరార్‌. అంతే కాదు లోతుగా విచారణ చేయగా జనసేనను బదనాం చేసేందుకు హీరోయిన్ పూనం కౌర్‌పైనా ఇతడు ఇదే తరహా ప్రచారం సోషల్ మీడియాలో చేసినట్టు పోలీసులు తేల్చారు.

ఇటీవలే కోటి వ్యవహారం వెనుక నాటి డీజీపీ, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 మూర్తిల హస్తముందని ఆ విషయాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ లేదా సీఐడీ విచారణ ఒక్కటే మార్గమని లక్ష్మీపార్వతి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.

సీన్‌ కట్ చేస్తే ఇప్పుడు కోటి కాషాయంలో కలిసిపోయి పరమపవిత్రుడయ్యారు. కేసులున్న టీడీపీ నేతలు, ఆ పార్టీకి అనుబంధం ఉన్న అక్రమార్కులు రక్షణ కోసం బీజేపీలో చేరిపోతున్నారని ఇప్పటికే ప్రచారం బాగా సాగుతున్న వేళ… మహిళలపై తప్పుడు ప్రచారం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న కోటిని కూడా… అందులోనూ ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కండువా కప్పి ఆహ్వానించడం రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీ చేయబోయే రాజకీయం తాలుకూ విలువలకు అద్దంపడుతోంది. త్వరలోనే ఐటీ గ్రిడ్ అశోక్‌ కూడా బీజేపీలో చేరుతాడేమో…. చూడాలని అని కొందరు అంటున్నారు.

First Published:  2 July 2019 1:20 AM GMT
Next Story