Telugu Global
NEWS

చంద్రబాబుకు పుల్లారావు రూపంలో రెండో దెబ్బ

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు రూపంలో వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్లను కొనేందుకు ప్రభుత్వ ధనాన్నే ఖర్చు చేయడాన్ని సవాల్ చేస్తూ పుల్లారావు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా… సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించింది. నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు పెంటపాటి పుల్లారావు నుంచి మరో ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదురవుతోంది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందని దానిపై దర్యాప్తుకు ఆదేశించాలంటూ కేంద్రానికి కొద్ది […]

చంద్రబాబుకు పుల్లారావు రూపంలో రెండో దెబ్బ
X

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు రూపంలో వరుస ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓట్లను కొనేందుకు ప్రభుత్వ ధనాన్నే ఖర్చు చేయడాన్ని సవాల్ చేస్తూ పుల్లారావు సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా… సుప్రీం కోర్టు సీరియస్‌గా స్పందించింది. నోటీసులు జారీ చేసింది.

చంద్రబాబుకు పెంటపాటి పుల్లారావు నుంచి మరో ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదురవుతోంది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి జరిగిందని దానిపై దర్యాప్తుకు ఆదేశించాలంటూ కేంద్రానికి కొద్ది రోజుల క్రితం ఒక లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర జలవనరుల శాఖ నిఘా విభాగం పరిగణనలోకి తీసుకుని తిరిగి పుల్లారావుకు లేఖ రాసింది.

పోలవరంపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది మీరేనా?… దర్యాప్తుకు ఆదేశిస్తే మీరు సహకరిస్తారా?, అవినీతికి సంబంధించిన ఆధారాలను చూపిస్తారా? ఒకసారి స్పష్టత ఇవ్వండి అంటూ ఇటీవల కేంద్రం నుంచి లేఖ వచ్చింది. అందుకు తక్షణం స్పందించిన పుల్లారావు… పోలవరంలో అవినీతిపై లేఖ రాసింది తానేనని… అవినీతిని నిరూపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తూ కేంద్రానికి తిరిగి లేఖ రూపంలో సమాధానం చెప్పారు.

పెంటపాటి పుల్లారావు లేఖకు కేంద్ర జలవనరుల శాఖ నిఘా విభాగం స్పందించి తిరిగి లేఖ రాయడం, అందుకు పుల్లారావు మరోసారి స్పందిస్తూ అవినీతిని నిరూపించేందుకు సిద్ధమని రెండు రోజుల క్రితం లేఖ రాసిన నేపథ్యంలో పోలవరం అవినీతిపై కేంద్రం దర్యాప్తు దిశగా పావులు కదుపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  2 July 2019 10:55 AM GMT
Next Story