Telugu Global
NEWS

ప్రపంచకప్ మహిళా సాకర్ సెమీస్ లో అమెరికా

క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ కు అమెరికా షాక్  ఆఖరి క్వార్టర్ ఫైనల్లో జర్మనీకి స్వీడన్ చెక్ 2019 పీఫా మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ సెమీఫైనల్స్ కు ఆతిథ్య ఫ్రాన్స్ చేరుకోవడంలో విఫలమయ్యింది. మాజీ చాంపియన్ జర్మనీ సైతం..క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. మాజీ చాంపియన్ అమెరికా, సంచలనాల స్వీడన్ జట్లు సెమీ ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి. పారిస్ వేదికగా ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో హాట్ ఫేవరెట్ అమెరికా 2-1 గోల్స్ […]

ప్రపంచకప్ మహిళా సాకర్ సెమీస్ లో అమెరికా
X
  • క్వార్టర్ ఫైనల్స్ లో ఫ్రాన్స్ కు అమెరికా షాక్
  • ఆఖరి క్వార్టర్ ఫైనల్లో జర్మనీకి స్వీడన్ చెక్

2019 పీఫా మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ సెమీఫైనల్స్ కు ఆతిథ్య ఫ్రాన్స్ చేరుకోవడంలో విఫలమయ్యింది. మాజీ చాంపియన్ జర్మనీ సైతం..క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది.

మాజీ చాంపియన్ అమెరికా, సంచలనాల స్వీడన్ జట్లు సెమీ ఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

పారిస్ వేదికగా ముగిసిన రెండో క్వార్టర్ ఫైనల్లో హాట్ ఫేవరెట్ అమెరికా 2-1 గోల్స్ తో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టును కంగుతినిపించి… సెమీస్ లో అడుగుపెట్టింది. అమెరికా ప్లేయర్లలో రాపినో, ఫ్రెంచ్ ప్లేయర్ వెయినార్డ్ గోల్స్ సాధించారు.

జర్మనీకి స్వీడన్ కిక్…

ప్రస్తుత ప్రపంచకప్ లో ప్రత్యర్థులకు ఒక్క గోలు ఇవ్వకుండా క్వార్టర్ ఫైనల్స్ వరకూ వచ్చిన హాట్ ఫేవరెట్ జర్మనీ పోటీ ముగిసింది. జర్మనీపై స్వీడన్ 2-1 గోల్స్ తో సంచలన విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.
సెమీఫైనల్స్ చేరిన జట్లలో ఇంగ్లండ్, అమెరికా, స్వీడన్, నెదర్లాండ్స్ ఉన్నాయి.

First Published:  1 July 2019 9:23 PM GMT
Next Story