Telugu Global
NEWS

బాబు సీఎంగా లేరని టీవీలు కట్టేసి మహిళలు కన్నీరు.... "నీవెట్లా ఓడావయ్యా" ధారావాహికంలో గల్లా అరుణ

ఓడిపోయి నెల అవుతున్నా సరే… చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేతల వరకు మనస్పూర్తిగా ప్రజల తీర్పును స్వాగతించలేకపోతున్నారు. ఓడింది చంద్రబాబు కాదు… ఓటేసిన ప్రజలే అంటూ వింత వాదనతో నెట్టుకొస్తున్నారు. ఆత్మసంతృప్తి కోసం సొంత స్క్రిప్ట్‌ చదువుకుని ఆనందిస్తున్నారు. ‘నీవెట్లా ఓడావయ్యా’ అంటూ రోజూ టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబు ఇంటికి వచ్చి ఓదార్చడం షరామాములైపోయింది. టీడీపీ నేతల ఫర్ఫార్మెన్స్‌ చూస్తుంటే… దూకుడు సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ను నమ్మించినట్టుగా చంద్రబాబును కూడా భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నించడం […]

బాబు సీఎంగా లేరని టీవీలు కట్టేసి మహిళలు కన్నీరు.... నీవెట్లా ఓడావయ్యా ధారావాహికంలో గల్లా అరుణ
X

ఓడిపోయి నెల అవుతున్నా సరే… చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేతల వరకు మనస్పూర్తిగా ప్రజల తీర్పును స్వాగతించలేకపోతున్నారు. ఓడింది చంద్రబాబు కాదు… ఓటేసిన ప్రజలే అంటూ వింత వాదనతో నెట్టుకొస్తున్నారు.

ఆత్మసంతృప్తి కోసం సొంత స్క్రిప్ట్‌ చదువుకుని ఆనందిస్తున్నారు. ‘నీవెట్లా ఓడావయ్యా’ అంటూ రోజూ టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబు ఇంటికి వచ్చి ఓదార్చడం షరామాములైపోయింది.

టీడీపీ నేతల ఫర్ఫార్మెన్స్‌ చూస్తుంటే… దూకుడు సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ను నమ్మించినట్టుగా చంద్రబాబును కూడా భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నించడం లేదు కదా అన్న అనుమానం కూడా కలుగుతోంది.

మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో మంత్రిగా చేసి ఆ తర్వాత టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి కూడా చంద్రబాబు ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు.

చంద్రబాబును పరామర్శించేందుకు వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన గల్లా అరుణకుమారి… చంద్రబాబే ఇప్పటికీ ముఖ్యమంత్రి అని ప్రకటించారు. ఆయన్ను ఎక్స్- సీఎం అని తాను అనబోనని… చంద్రబాబు ఇప్పటికీ మన ముఖ్యమంత్రే అని ప్రకటించారు. తన ప్రసంగం అంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అంటూనే కొనసాగించారు ఆమె.

చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని జనం ఓట్లేశారని… కానీ ఆ ఓట్లు ఏమైపోయాయో అర్థం కావడం లేదన్నారామె. బాబుగారు ముఖ్యమంత్రిగా లేరని తెలిసిన తర్వాత రాష్ట్రంలో మహిళలు టీవీలు కూడా చూడకుండా కట్టేసి కన్నీరు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని గల్లా అరుణకుమారి సెలవిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని… చంద్రబాబు కూడా ధైర్యంగా ఉండాలని ఆమె సలహా ఇచ్చారు.

First Published:  2 July 2019 1:27 AM GMT
Next Story