‘అ’ దర్శకుడితో నాని ?

ఈ మధ్యనే ‘జెర్సీ’ సినిమాతో మర్చిపోలేని హిట్ అందుకున్న నాచురల్ స్టార్ నాని… ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత నాని తన తదుపరి సినిమా కోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ నాని కి ఒక కథ వినిపించినట్లు తెలుస్తోంది.

నిజానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘అ!’ ని నిర్మించింది నాని నే. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు రెస్పాన్స్ నే అందుకుంది.

ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ మధ్యనే విడుదలైన ‘కల్కి’ సినిమా కూడా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. మరి నాని ఈ దర్శకుడితో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. నాని తదుపరి సినిమా గురించిన ప్రకటన మరి కొన్ని వారాల్లో బయటకు రానుందని తెలుస్తోంది.