Telugu Global
Cinema & Entertainment

స్టుడియో రౌండప్ (02-07-2019)

విరాటపర్వం రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను వరంగల్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ మారుమూల పల్లెలో పూర్తిచేశారు. రేపట్నుంచి మెదక్ పరిసర ప్రాంతాల్లో సెకెండ్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. వెంకీ మామ నాగచైతన్య, వెంకటేష్ హీరోలుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. […]

స్టుడియో రౌండప్ (02-07-2019)
X

విరాటపర్వం

రానా, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను వరంగల్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ మారుమూల పల్లెలో పూర్తిచేశారు. రేపట్నుంచి మెదక్ పరిసర ప్రాంతాల్లో సెకెండ్ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

వెంకీ మామ

నాగచైతన్య, వెంకటేష్ హీరోలుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. ఇప్పటికే కశ్మీర్ లో మేజర్ పార్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విశాఖలో ల్యాండ్ అయింది. అందమైన విశాఖ బీచ్ లో రాశిఖన్నా, చైతూ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత రామానాయుడు స్టుడియోస్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ టాకీ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే. తాజాగా పాటల షూటింగ్ కూడా పూర్తిచేశారు. రామ్, నిధి అగర్వాల్ మధ్య తీసిన సాంగ్ తో పాటల షూటింగ్ పూర్తయింది. రీసెంట్ గా ఆ పాట లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ డేట్ ను ప్రకటిస్తారు. పూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను 18న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

డిస్కోరాజా

రవితేజ హీరోగా… వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కోరాజా సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రవితేజతో పాటు మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ప్రతిరోజు పండగే

చిత్రలహరి లాంటి సక్సెస్ తర్వాత మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమాను స్టార్ట్ చేశాడు సాయితేజ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ గచ్చిబౌళి సమీపంలో జరుగుతోంది. సాయితేజ్, ప్రవీణ్, సుహాస్ పై కొన్ని కామెడీ సీన్లు తీస్తున్నారు. మరో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ నడుస్తుంది.

అఖిల్

హీరోయిన్ లేకపోయినా సెట్స్ పైకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ అక్కినేని హీరో చేయబోయే సినిమా రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ మోడ్ లోకి రాబోతోంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత హీరోయిన్ ను ఫైనలైజ్ చేస్తారు.

సైలెన్స్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సైలెన్స్ సినిమా రెగ్యులర్ షూటింగ్ అమెరికాలోని సియాటిల్ సిటీలో జరుగుతోంది. మూవీ టాకీకి సంబంధించి ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో మాధవన్ , అంజలి, షాలిని పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

రాజుగారి గది 3

అన్నపూర్ణ స్టుడియోస్ నుంచి సారధి స్టుడియోస్ కు షిఫ్ట్ అయింది రాజుగారి గది-3 సినిమా. ఈ ప్రాజెక్టు నుంచి తమన్న తప్పుకోవడంతో ప్రస్తుతానికి నటుడు అశ్విన్ తో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత షూటింగ్ ఆపేస్తారు. హీరోయిన్ ను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

First Published:  2 July 2019 7:00 AM GMT
Next Story