Telugu Global
Cinema & Entertainment

బిగ్ బాస్ షో లో... భార్యాభర్తలు?

ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ షో గురించిన వివరాలు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణం లో నాగార్జున ఈ షో కి హోస్ట్ గా ఉండబోతున్నాడు అనే న్యూస్ ఒక్కసారిగా సంచలనం రేపింది. అయితే నాగార్జున ఈ షో లో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది షో మొదలయ్యేప్పుడు మాత్రమే తెలుస్తుంది. కానీ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి మాత్రం రోజుకొక కొత్త వార్త బయటకు వస్తుంది. ఇప్పటి వరకు షో లో అధికారికం గా […]

బిగ్ బాస్ షో లో... భార్యాభర్తలు?
X

ఎప్పుడెప్పుడు బిగ్ బాస్ షో గురించిన వివరాలు వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణం లో నాగార్జున ఈ షో కి హోస్ట్ గా ఉండబోతున్నాడు అనే న్యూస్ ఒక్కసారిగా సంచలనం రేపింది. అయితే నాగార్జున ఈ షో లో ఏ మేరకు మెప్పిస్తాడు అనేది షో మొదలయ్యేప్పుడు మాత్రమే తెలుస్తుంది.

కానీ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి మాత్రం రోజుకొక కొత్త వార్త బయటకు వస్తుంది. ఇప్పటి వరకు షో లో అధికారికం గా ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అనేది తెలియ రాలేదు కానీ ఒక రియల్ లైఫ్ కపుల్ మాత్రం ఈ షో లో ఉండనున్నారు అని తెలుస్తుంది. ఇంతకు ముందు వేరే భాషల్లో విడిపోయిన జంటలు, ప్రేమ జంటలు పాల్గొన్నాయి… కానీ ఒక రియల్ లైఫ్ కపుల్ ఎప్పుడూ కలిసి రాలేదు.

అయితే ఫిలిం నగర్ లో ఆసక్తికరమైన చర్చ ప్రకారం ఈ షో లో హీరో వరుణ్ సందేశ్ తన భార్య వితికతో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పాల్గొనబోతున్నారట.

అయితే ఈ ఇద్దరు నిజం గా ఈ షో కి ఒపుకున్నారా లేక కేవలం అది మీడియా సృష్టేనా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

First Published:  2 July 2019 1:03 AM GMT
Next Story