కోహ్లితో 87ఏళ్ల అభిమాని… స్టేడియంలో అరుదైన సంఘటన

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం తర్వాత ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా వీరాభిమాని అయిన 87 ఏళ్ల బామ్మ వద్దకు వెళ్లి కెప్టెక్ కోహ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో కాసేపు ముచ్చటించారు.

కోహ్లితో పాటు రోహిత్‌ శర్మ కూడా బామ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. 87ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు చారులత పటేల్. టీమిండియాకు వీరాభిమాని. స్టేడియంలో ఉత్సాహంగా టీమిండియాను ఉత్తేజపరుస్తూ… భారత్‌ ఆటగాళ్లు బౌండరీలు బాదినప్పుడు వారిని అభినందిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

మ్యాచ్‌ అయిపోగానే కోహ్లి, రోహిత్‌లు బామ్మవద్దకు వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. బామ్మతో తానున్న ఫోటోలను కోహ్లి కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంతటి ఫ్యాషినేట్‌, డెడికేటెడ్‌ ఫ్యాన్‌ను ఇంతవరకూ తాను చూడలేదని కోహ్లి వ్యాఖ్యానించారు. వయసన్నది కేవలం ఒక అంకె మాత్రమే అని కోహ్లి ట్వీట్ చేశారు.