Telugu Global
NEWS

కోపా అమెరికాకప్ సెమీస్ లైనప్ రెడీ

తొలి సెమీస్ లో బ్రెజిల్ తో అర్జెంటీనా ఢీ రెండో సెమీస్ లో పెరూతో చిలీ అమీతుమీ క్వార్టర్స్ లోనే కొలంబియా, ఉరుగ్వే అవుట్ లాటిన్ అమెరికా సాకర్ సంరంభం కోపా అమెరికా కప్ సెమీ ఫైనల్స్ లైనప్ పూర్తయ్యింది. మాజీ చాంపియన్ ఉరుగ్వే, కొలంబియా, వెనిజ్వేలా, పరాగ్వే జట్లు..క్వార్టర్ ఫైనల్స్ లోనే నిష్క్రమించగా… హాట్ ఫేవరెట్లు బ్రెజిల్, అర్జెంటీనా, డిఫెండింగ్ చాంపియన్ చిలీ, పెరూజట్లు సెమీఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో పరాగ్వేను […]

కోపా అమెరికాకప్ సెమీస్ లైనప్ రెడీ
X
  • తొలి సెమీస్ లో బ్రెజిల్ తో అర్జెంటీనా ఢీ
  • రెండో సెమీస్ లో పెరూతో చిలీ అమీతుమీ
  • క్వార్టర్స్ లోనే కొలంబియా, ఉరుగ్వే అవుట్

లాటిన్ అమెరికా సాకర్ సంరంభం కోపా అమెరికా కప్ సెమీ ఫైనల్స్ లైనప్ పూర్తయ్యింది. మాజీ చాంపియన్ ఉరుగ్వే, కొలంబియా, వెనిజ్వేలా, పరాగ్వే జట్లు..క్వార్టర్ ఫైనల్స్ లోనే నిష్క్రమించగా… హాట్ ఫేవరెట్లు బ్రెజిల్, అర్జెంటీనా, డిఫెండింగ్ చాంపియన్ చిలీ, పెరూజట్లు సెమీఫైనల్స్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

తొలి క్వార్టర్ ఫైనల్లో పరాగ్వేను ఆతిథ్య బ్రెజిల్ పెనాల్టీ షూటౌట్ ద్వారా 4-3 గోల్స్ తో అధిగమించగా…రెండో క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా 2-0 గోల్స్ తో వెనిజ్వేలాను ఇంటిదారి పట్టించింది.

మూడో క్వార్టర్ ఫైనల్లో పెరూ… పెనాల్టీ షూటౌట్ ద్వారా మాజీ చాంపియన్ ఉరుగ్వేను కంగు తినిపించింది.

2007 తర్వాత అరుదైన సమరం..

లాటిన్ అమెరికా సాకర్ దిగ్గజాలు అర్జెంటీనా, బ్రెజిల్ జట్లు ఒకదానితో ఒకటి ఢీ కొంటున్నాయంటే చాలు..అ మజాయే వేరు.
ప్రస్తుత కోపా అమెరికాకప్ తొలి సెమీస్ లో ఈ రెండుజట్లే తలపడబోతున్నాయి.

2007 తర్వాత బ్రెజిల్ తో అర్జెంటీనా తలపడబోడం ఇదే మొదటిసారి. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చిలీకి పెరూ సవాలు విసురుతోంది.

First Published:  3 July 2019 3:48 AM GMT
Next Story