Telugu Global
Cinema & Entertainment

ట్రైలర్ టాక్: రామ్-పూరి జగన్ ల 'ఇస్మార్ట్ శంకర్'

రామ్ పోతినేని ప్రధాన పాత్ర లో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతం గా పాజిటివ్ బజ్ ఉన్న సంగతి తెలిసిందే. కొత్త గా ఈ సినిమా గురించి చెప్పేది ఏమి లేదు కానీ… ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. సరిగ్గా చెప్పినట్టు గానే 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు దర్శక […]

ట్రైలర్ టాక్: రామ్-పూరి జగన్ ల ఇస్మార్ట్ శంకర్
X

రామ్ పోతినేని ప్రధాన పాత్ర లో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇప్పటికే ఈ సినిమా మీద విపరీతం గా పాజిటివ్ బజ్ ఉన్న సంగతి తెలిసిందే.

కొత్త గా ఈ సినిమా గురించి చెప్పేది ఏమి లేదు కానీ… ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. సరిగ్గా చెప్పినట్టు గానే 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్ కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చెప్పవచు. అదే రేంజ్ లో ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కూడా కట్ చేశారు. అటు రాము క్యారెక్టర్ గురించి ప్రేక్షకులకి పరిచయం చేస్తూ సినిమా లోని కథ ని కూడా పరిచయం చేశారు దర్శకుడు.

కెమెరా పనితనం, మణిశర్మ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్ పైన ఆసక్తి ని రేకెత్తించాయి. ఈ సారి పూరి ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో ఈ సినిమా తీసినట్టుగా ఉన్నాడు. ముఖ్యం గా రామ్ మెదడులోకి సిం కార్డు పెట్టడం అనే అంశం ఆసక్తి రేపుతోంది.

నభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి తో పాటు చార్మీ కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఈ సినిమా ఈ నెల 18 న విడుదల అవుతుంది.

First Published:  3 July 2019 6:47 AM GMT
Next Story