లంచం తీసుకున్న వీఆర్‌వోను రఫ్పాడించిన రైతు…( వీడియో)

భారీగా జీతాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఉద్యోగులకు బక్కచిక్కిన రైతుల రక్తం తాగనిదే నిద్ర పట్టదు. కాకపోతే ఇటీవల రైతుల్లో, సామాన్యుల్లో చైతన్యం పెరగడంతో అక్కడక్కడ అవినీతి ఉద్యోగుల పరువు బజారున పడుతోంది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోనూ ఒక రైతు గుండె మండింది.

పది వేలు లంచం తీసుకుని కూడా పనిచేయకుండా…. తప్పుడు సర్వే నెంబర్లు వేస్తూ…. పాస్‌ బుక్ ఇవ్వకుండా వేధిస్తున్న ఒక వీఆర్‌వోను రైతు గట్టిగా నిలదీశారు. అందరి ముందు ఉతికేశాడు.

లంచం తీసుకుని కూడా పనిచేయకుండా వేధిస్తున్నావ్ ఎందుకంటూ రైతు నిలదీయడం, అందరూ గుమిగూడడంతో వీఆర్‌వోకు చెమటలు పట్టాయి. లంచం తీసుకున్నదే కాక పోలీసు స్టేషన్‌కు వెళ్తా అంటూ తిరిగి రైతునే బెదిరించే ప్రయత్నం చేశాడు వీఆర్‌వో.

అయినా సరే రైతు వెనక్కు తగ్గకపోవడంతో అతి కష్టం మీద తప్పించుకుని బైకు మీద పారిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.

లంచం తీసుకోగానే సంబరం కాదు పని చేయకపోతే ఇలాగే ఉంటుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం శివారు వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి కి పాస్ బుక్ ఇస్తానని 10 వేలు లంచం తీసుకుని పాస్ బుక్ ఇవ్వకపోవడంతో VRO బండి తాళాలు లాక్కుంటున్న రైతు.వీడియో తీస్తున్నారని పారిపోతున్న VRO…. లంచం తీసుకోడమే కాక పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అంటూ రైతుని బెదిరిస్తున్న VRO

Posted by YSRCP Social Media on Monday, 1 July 2019