కులకలం… ఎమ్మెస్కే ప్రసాద్‌పై నెటిజన్ల దండయాత్ర

తెలుగు రాష్ట్రాల్లో కుల పిచ్చి రాజకీయాలకే కాకుండా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. తాజాగా అంబటి రాయుడు అవమానకరంగా క్రికెట్ నుంచి నిష్క్రమించడం దుమారం రేపుతోంది. బీసీసీఐలో రాజకీయాలు ఎలా ఉన్నా… ఏపీలో ఈ అంశం కులం రంగు పులుముకుంది. అంబటి రాయుడి పట్ల తొలి నుంచీ చీఫ్‌ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ విముఖంగా ఉంటూ వస్తున్నారు.

అంబటి రాయుడిని పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఎమ్మెస్కే ప్రసాదే అన్నది చాలా మంది ఆరోపణ. ఒకే రాష్ట్రానికి చెందినప్పటికీ అంబటి రాయుడిని తొక్కేయడం వెనుక ఎమ్మెస్కే ప్రసాద్ కుల కోణం ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎమ్మెస్కే ప్రసాద్‌ కుల పిచ్చి కారణంగానే రాయుడి కేరీర్ నాశనం అయిందంటూ పలువురు నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు.

అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఎమ్మెస్కే ప్రసాద్‌ కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. కుల తత్వం కారణంగానే ఎమ్మెస్కే ప్రసాద్‌కు … కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు గొప్ప పేరు తెచ్చుకోవడం ఇష్టం లేదని అందుకే జట్టులోకి రాకుండా తొక్కేశారని ఆరోపిస్తున్నారు.

అంబటి రాయుడికి మద్దతుగా ఒక వర్గం నెటిజన్లు పోస్టులు పెడుతుంటే.. మరో వర్గం నెటిజన్లు అంబటి రాయుడిని హేళన చేస్తూ… ఎమ్మెస్కే ప్రసాద్‌ను సమర్ధిస్తూ పోస్టులు పెడుతున్నారు.