Telugu Global
Cinema & Entertainment

సమంతా.... 2 కోట్లు తీసుకుందా?

టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్ హీరోయిన్ ల లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో సమంత కూడా ఒకరు. మరి తాజాగా ‘ఓ బేబీ’ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో అనేది హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం సమంత ఈ సినిమాలో నటించినందుకు రెమ్యూనరేషన్ కాకుండా చిత్రంలోని ప్రాఫిట్ లలో షేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే దాదాపు రెండు కోట్ల షేర్ ను సమంత […]

సమంతా.... 2 కోట్లు తీసుకుందా?
X

టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్ హీరోయిన్ ల లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో సమంత కూడా ఒకరు. మరి తాజాగా ‘ఓ బేబీ’ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో అనేది హాట్ టాపిక్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం సమంత ఈ సినిమాలో నటించినందుకు రెమ్యూనరేషన్ కాకుండా చిత్రంలోని ప్రాఫిట్ లలో షేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే దాదాపు రెండు కోట్ల షేర్ ను సమంత తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక తమిళనాడు, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో కూడా విడుదల కాబోతోంది. అన్నింటిలోను ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ లు నమోదు చేసుకుంటుందని చిత్రబృందం విశ్వసిస్తోంది.

నిర్మాతలకు…. మిగతా ఆర్టిస్ట్ లు మరియు టెక్నీషియన్స్ కోసం మరొక 6 కోట్లు ఖర్చు అయ్యిందట. మరోవైపు సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘మిస్ గ్రానీ’ నీ నిర్మించిన హ్యున్ వూ థామస్ కిమ్ కి 10 కోట్లు చెల్లించారట. అంటే ఈ సినిమాకి మొత్తంగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు 18 కోట్లు బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది.

First Published:  3 July 2019 12:00 AM GMT
Next Story