Telugu Global
Cinema & Entertainment

శివాత్మిక రాజశేఖర్ కు.... నాని అంటే ఇష్టమట!

దొరసాని అనే చిత్రం తో త్వరలో తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెడుతున్న నటులు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్. ఈ ఇద్దరికీ ఫ్యామిలీ బాగ్రౌండ్ ఉన్నప్పటికీ… మొదటి సినిమా ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవలే మీడియా తో ముచ్చటిస్తూ… వీరిద్దరూ సినిమా పరిశ్రమ లో వాళ్ళకు ఇష్టమైన నటుల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భం లో శివాత్మిక కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. శివాత్మిక… తనకి హిందీ […]

శివాత్మిక రాజశేఖర్ కు.... నాని అంటే ఇష్టమట!
X

దొరసాని అనే చిత్రం తో త్వరలో తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెడుతున్న నటులు ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్. ఈ ఇద్దరికీ ఫ్యామిలీ బాగ్రౌండ్ ఉన్నప్పటికీ… మొదటి సినిమా ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇటీవలే మీడియా తో ముచ్చటిస్తూ… వీరిద్దరూ సినిమా పరిశ్రమ లో వాళ్ళకు ఇష్టమైన నటుల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భం లో శివాత్మిక కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది.

శివాత్మిక… తనకి హిందీ లో రణ్వీర్ సింగ్, ఆదిత్య రాయ్ కపూర్, రన్బీర్ కపూర్, విక్కీ కౌశల్ అంటే ఇష్టం అని తెలిపింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమ విషయానికి వస్తే, తెలుగు లో తనకి నాని అంటే ప్రేమ అని చెప్పింది.

నిజానికి చాలా మంది నాని అంటే ఇష్టం అంటారు. కానీ ఈమెకి మాత్రం నాని మీద ఎనలేని ప్రేమ…. నాని నటన అంటే ఎంతో అభిమానమట. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా శివాత్మిక కి చాలా ఇష్టం అని తెలిపింది. తను నటించిన దొరసాని ఈ నెల 12 న విడుదల అవుతుంది.

First Published:  3 July 2019 5:11 AM GMT
Next Story