Telugu Global
Health & Life Style

మొక్కజొన్న రుచికే కాదు... ఆరోగ్యానికి కూడా...!

కొద్దిగా చినుకు పడితే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అదే మొక్నజొన్న పొత్తు కనిపిస్తే వదులుతామా.. పూర్వం దీనిని కాల్చుకుని కాని, ఉడకపెట్టుకుని కాని తినేవారు. మారిన పరిస్థితుల కారణంగా దీనిని అనేక రకాలుగా వండుకుని తింటున్నారు. సూప్, గ్రేవీ, రకరకాల స్నాక్స్ గా చేసుకుని తింటున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే మొక్కజొన్న మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, దీని వల్ల జరిగే ఆరోగ్య పరిరక్షణ కూడా తెలుసుకోవాలి కదా. దీనిలో అనేక ఔషధ గుణాలు […]

మొక్కజొన్న రుచికే కాదు... ఆరోగ్యానికి కూడా...!
X

కొద్దిగా చినుకు పడితే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అదే మొక్నజొన్న పొత్తు కనిపిస్తే వదులుతామా.. పూర్వం దీనిని కాల్చుకుని కాని, ఉడకపెట్టుకుని కాని తినేవారు. మారిన పరిస్థితుల కారణంగా దీనిని అనేక రకాలుగా వండుకుని తింటున్నారు. సూప్, గ్రేవీ, రకరకాల స్నాక్స్ గా చేసుకుని తింటున్నారు.

ఇంత వరకూ బాగానే ఉంది. అయితే మొక్కజొన్న మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, దీని వల్ల జరిగే ఆరోగ్య పరిరక్షణ కూడా తెలుసుకోవాలి కదా. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం….

  • రక్తహీనతతో బాధపడే వారికి మొక్కజొన్న మంచి మందు. రక్తంలో ఐరన్ శాతాన్ని పెంచడానికి మొక్కజొన్న ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఎర్రకణాలకు ఎంతో మేలు చేస్తుంది.
  • గర్బణులకు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవసరం. మొక్కజొన్నలో ఉన్న ఫోలిక్ యాసిడ్ ఇటు తల్లికి, అటు కడుపులోని బిడ్డకు కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే కడుపులోని పిండం ఎదుగుదల ఉండదు. అలాంటప్పుడు మొక్నజోన్న తింటే ఎంతో మంచిది.
  • హెయిర్ ఫాల్ అధికంగా ఉంటే ప్రతిరోజు గుప్పెడు మొక్కజొన్నలను తినండి. క్రమేపీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు కూడా గట్టిపడి, కురులు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
  • మొక్కజొన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు.
  • మొక్కజొన్నలో ఉండే పీచు శరీరంలో కొవ్వును పెరగకుండా చూసుకుంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
  • మొక్కజొన్న పెద్దప్రేగు క్యాన్సర్ ను అంటే కొలెన్ క్యాన్సర్ ను నివారిస్తుంది. మొక్కజొన్న తరచుగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే Beta-cryptoxanthin, విటమిన్ ఏ ఊపిరితిత్తులను బలంగా ఉంచుతుంది.
  • చెడు కొలెస్ట్రాల్ ను అదుపు చేయడంలో మొక్కజొన్నలో ఉండే పోషకాలు ఎంతో చురుకుగా పనిచేస్తాయి.
  • మొక్కజొన్నలో విటమిన్ ఏ, ఐరన్, ఫైబర్ తో పాటు మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ ఫరస్ కూడా ఉన్నాయి. ఇవి ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తాయి.
  • నిత్యం యవ్వనంగా కనిపించాలంటే.. ప్రతిరోజు మొక్కజొన్న తినాలని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి తోడ్పడుతుందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • మొక్క జొన్న కిడ్నీ సమస్యలను కూడా నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మొక్కజొన్న తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయిని… వీటిని తరచూ ఆహారంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
First Published:  4 July 2019 12:40 AM GMT
Next Story