బెంజ్‌ కారులో ఆత్మహత్యాయత్నం….

హైదరాబాద్‌ ఔటర్ రింగ్‌ రోడ్డు నార్సింగ్ లో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెంజ్‌ కారులోనే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని అశ్విన్‌ జైన్‌గా భావిస్తున్నారు. ఇతడు ఒక బంగారు వ్యాపారిగా పోలీసులు చెబుతున్నారు. కారు నెంబర్‌ టీఎస్‌ 09 యూబీ 6040 ఆధారంగా అశ్విన్‌జైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారును ఒకవైపుకు నిలిపి ఆ తర్వాత కాల్చుకున్నట్టు తెలుస్తోంది. అయితే అశ్విన్ జైన్ ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయాడు? ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.