Telugu Global
Cinema & Entertainment

చాణక్య షూటింగ్ అప్ డేట్

గోపీచంద్ నటిస్తున్న యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ చాణక్య. తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదే టైమ్ లో టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు సెకెండ్ లుక్ తో పాటు షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో, నల్ల అద్దాలు పెట్టుకొని గడ్డం పెంచిన […]

చాణక్య షూటింగ్ అప్ డేట్
X

గోపీచంద్ నటిస్తున్న యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ చాణక్య. తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అదే టైమ్ లో టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు సెకెండ్ లుక్ తో పాటు షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చారు.

కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో, నల్ల అద్దాలు పెట్టుకొని గడ్డం పెంచిన గోపీచంద్ స్టిల్ ఇది. నిజానికి ఫస్ట్ లుక్ స్టిల్ కు, తాజాగా విడుదల చేసిన ఫొటోకు పెద్దగా తేడా లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన 3 పాటల షూటింగ్ ప్లాన్ చేస్తారు.

పాటల షూటింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే విడుదల తేదీని ప్రకటించాలని నిర్ణయించారు. ఎందుకంటే, ఇంతకుముందు గోపీచంద్ నటించిన 2 సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అందుకే ఈసారి అలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ఫస్ట్ కాపీ పూర్తయిన తర్వాతే విడుదల తేదీ ప్రకటించాలని నిర్ణయించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు వెట్రి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  3 July 2019 9:15 PM GMT
Next Story