పాక్ కు ప్రపంచకప్ సెమీస్ బెర్త్ కష్టమే

  • బంగ్లాపై 316 పరుగులతో నెగ్గితేనే చాన్స్ 
  • నెట్ రన్ రేట్ లో పాక్ పై కివీస్ దే పైచేయి
  • రెండో సెమీస్ లో భారత్ తో ఇంగ్లండ్ అమీతుమీ

వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్స్ లైనప్ దాదాపుగా ఖరారయ్యింది. మాజీ చాంపియన్ పాకిస్థాన్ కు సెమీస్ బెర్త్ అందని ద్రాక్షలా మారింది.

న్యూజిలాండ్ తో కలిసి 9 పాయింట్లతో నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్న పాక్ జట్టు…. నెట్ రన్ రేట్ దామాషాన.. న్యూజిలాండ్ కంటే ఎంతో వెనుకబడి ఉంది.

బంగ్లాదేశ్ తో జరిగే లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ లో పాకిస్థాన్ 316 పరుగుల భారీ తేడాతో నెగ్గగలిగితేనే…నెట్ రన్ రేట్ లో మెరుగైన జట్టుగా సెమీస్ చేరగలుగుతుంది. అయితే …పాక్ జట్టు ప్రస్తుత ఆటతీరు, ప్రత్యర్థి బంగ్లాదేశ్ జోరును బట్టి చూస్తే..316 పరుగుల భారీవిజయం అసాధ్యమే అనిపిస్తోంది.

నాలుగు స్తంభాలాట…

ప్రపంచకప్ ఆఖరి రౌండ్ పోటీలలో బంగ్లాదేశ్ తో పాకిస్థాన్, శ్రీలంకతో భారత్, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియాజట్లు తలపడాల్సి ఉంది.

ఆఖరి రౌండ్ మ్యాచ్ ల ఫలితాల ప్రమేయం లేకుండానే…ఇప్పటికే టేబుల్ టాపర్ హోదాలో ఆస్ట్రేలియా, రెండోస్థానంలో నిలవడం ద్వారా భారత్, మూడో స్థానం సాధించిన ఇంగ్లండ్, 11 పాయింట్లతో నాలుగో స్థానం సాధించడం ద్వారా న్యూజిలాండ్ జట్లు సెమీస్ బెర్త్ లు ఖాయం చేసుకొన్నాయి.

9న మాంచెస్టర్ వేదికగా తొలి సెమీస్

మాంచెస్టర్ వేదికగా ఈ నెల 9న జరిగే తొలి సెమీఫైనల్లో గత ఏడాది ఫైనలిస్టులు, చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

11న భారత్-ఇంగ్లండ్ సెమీస్

బర్మింగ్ హామ్ వేదికగా ఈ నెల 11న జరిగే రెండో సెమీఫైనల్లో ప్రపంచ టాప్ ర్యాంక్ జట్లు ఇంగ్లండ్, భారత్ ఢీ అంటే ఢీ అంటున్నాయి.

లీగ్ దశలో తనకు ఎదురైన ఓటమికి ..ఈ నాకౌట్ ఫైట్ లో ఇంగ్లండ్ పని పట్టాలన్న పట్టుదలతో విరాట్ సేన ఉంది. సౌతాఫ్రికా, పాకిస్తాన్, విండీస్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల పోరు…లీగ్ దశలోనే ముగిసినట్లయ్యింది.