Telugu Global
NEWS

పరిటాల శ్రీరామే గతి...

అనంతపురం జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఎవరు టీడీపీకి గుడ్‌ బై చెప్పి వెళ్లిపోతారో అని శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయి. చంద్రబాబు హయాంలో మోతాదుకు మించి సంపాదించేసిన నేతలు ఇప్పుడు ఆ సొమ్మును కాపాడుకునేందుకు, వైసీపీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకునేందుకు టీడీపీ నేతలు ”నేర నిర్ధారణ వ్యతిరేక రక్షణ గృహం”గా బీజేపీని భావిస్తూ అటు వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి జంప్ చేశారు. […]

పరిటాల శ్రీరామే గతి...
X

అనంతపురం జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఎవరు టీడీపీకి గుడ్‌ బై చెప్పి వెళ్లిపోతారో అని శ్రేణులు బిక్కుబిక్కుమంటున్నాయి. చంద్రబాబు హయాంలో మోతాదుకు మించి సంపాదించేసిన నేతలు ఇప్పుడు ఆ సొమ్మును కాపాడుకునేందుకు, వైసీపీ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసుకునేందుకు టీడీపీ నేతలు ”నేర నిర్ధారణ వ్యతిరేక రక్షణ గృహం”గా బీజేపీని భావిస్తూ అటు వైపు చూస్తున్నారు.

ఈ కోవలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ధర్మవరం టీడీపీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు ధర్మవరం వెళ్లి టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. త్వరలోనే నియోజకవర్గానికి కొత్త నేతను పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ కొత్త నేతగా పరిటాల శ్రీరాం పేరు వినిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో తల్లిపై ఒత్తిడి తెచ్చి మరీ ఆమె స్థానంలో పోటీ చేసిన శ్రీరాం ఆరంగేట్రంలోనే అపజయం పాలయ్యారు. ఇప్పుడు ఆయన్ను ధర్మవరం పంపిస్తే రాప్తాడులో తిరిగి పరిటాల సునీతకు బాధ్యతలు అప్పగిస్తే సరిపోతుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. అయితే సొంత నియోజకవర్గంలోనే గెలవలేని పరిటాల శ్రీరాం ధర్మవరంలో చక్రం తిప్పడం సాధ్యమేనా అన్న అనుమానాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

పరిటాల శ్రీరాం యాటిట్యూడ్ పైనా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుత పరిస్థితిలో అంతకు మించి మరో ప్రత్యామ్నాయం కూడా లేదని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు.

అయితే ఒకవైపు వరదాపురం సూరి, మరొక వైపు పరిటాల శ్రీరాం నిలబడితే టీడీపీ ఓట్లే చీలిపోయి మధ్యలో వైసీపీకి పరిస్థితి మరింత అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.

First Published:  4 July 2019 1:09 AM GMT
Next Story