Telugu Global
Cinema & Entertainment

తిరుపతి ప్రయాణం వెనుక అసలు రహస్యం చెప్పిన సమంత

ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర లో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ ప్రమోషన్స్ మంచి జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో తెలియదు కానీ సమంత మాత్రం సినిమా మీద మంచి నమ్మకం తో ఉంది. సినిమా ఎలా వచ్చింది అనేది విడుదల అయ్యాక ప్రేక్షకులు ఎలాగో చెప్తారు. కానీ ఇటీవలే సమంత తన సినిమాల ముందు తిరుపతి వెళ్లడం అనే అంశం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే విషయం ఆవిడ దగ్గర […]

తిరుపతి ప్రయాణం వెనుక అసలు రహస్యం చెప్పిన సమంత
X

ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర లో తెరకెక్కిన చిత్రం ఓ బేబీ ప్రమోషన్స్ మంచి జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో తెలియదు కానీ సమంత మాత్రం సినిమా మీద మంచి నమ్మకం తో ఉంది.

సినిమా ఎలా వచ్చింది అనేది విడుదల అయ్యాక ప్రేక్షకులు ఎలాగో చెప్తారు. కానీ ఇటీవలే సమంత తన సినిమాల ముందు తిరుపతి వెళ్లడం అనే అంశం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే విషయం ఆవిడ దగ్గర ప్రస్తావించగా కొన్ని ఆసక్తికర విషయాలు ఆమె బయట పెట్టింది.

“సాధారణం గా నేను నా కోసం, నా సినిమాల కోసం ఎప్పుడూ తిరుపతి వెళ్ళలేదు.. కేవలం నా భర్త సినిమాలు బాగా ఆడాలి అని మాత్రం దేవుడిని కోరుకునేదానిని. అయితే ఈ సారి మాత్రం స్పెషల్. ఓ బేబీ సినిమా బాగా ఆడాలి అని నా కోసం నేను మొక్కుకొని తిరుపతి వెళ్లాను” అని ఈ సారి తిరుపతి ప్రయాణం వెనుక దాగిన రహస్యాన్ని సమంత మీడియా కి తెలియజేసింది.

First Published:  4 July 2019 7:00 AM GMT
Next Story