జ్యోతిష్యుడి మాట విని హత్య వరకు… శరవణ భవన్‌ అధినేత …

దక్షిణాదిలో పేరుగాంచిన శరవణ భవన్ హోటల్‌ అధినేత జైలుపాలైన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయనకు కోర్టు హత్య కేసులో యావజ్జీవ ఖైదు విధించింది. సాధారణ హోటల్ నుంచి ప్రముఖ హోటల్ స్థాయికి ఎదిగిన శరవణ హోటల్ అధినేత రాజగోపాల్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణం ఒక జ్యోతిష్యుడు.

అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న రాజగోపాల్‌కు మూడో పెళ్లి చేసుకుంటే ఇంకా కలిసి వస్తుందని జ్యోతిష్యుడు నమ్మించాడు. జ్యోతిష్యుడే ఒక అమ్మాయిని తీసుకొచ్చి…. పెళ్లి చేసుకోవాలని రాజగోపాల్‌కు సలహా ఇచ్చాడు.

అయితే అప్పటికే ఒక అతనిని ప్రేమించిన సదరు యువతి రాజగోపాల్, జ్యోతిష్యుడి పన్నాగం పసిగట్టి పెళ్లికి నిరాకరించింది. దాంతో రాజగోపాల్‌ రాక్షసుడిగా మారి అమ్మాయి ప్రేమించిన వ్యక్తిని 2001లో హత్య చేశాడు. ప్రియుడిని చంపేస్తే తనతో పెళ్లికి ఆమె అంగీకరిస్తుందని భావించాడు. కానీ అమ్మాయి రాజగోపాల్‌పై కేసు పెట్టింది.

విచారణలో రాజగోపాలే హత్య చేసినట్టు తేలింది. పలుకుబడి అడ్డుపెట్టుకుని కేసు నుంచి తప్పించుకునేందుకు రాజగోపాల్ ఎంతగా ప్రయత్నించినా చివరకు శిక్ష పడింది. యావజ్జీవ శిక్షను కోర్టు ఖరారు చేసింది.