Telugu Global
Cinema & Entertainment

ట్రైలర్ : "మిస్టర్. కేకే"....

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర లో కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్ గా త్వరలో రానున్న చిత్రం ‘కడరం కొండాన్’. తమిళంలో ఇప్పటికే సంచలనం రేపుతున్న ఈ సినిమా అందరినీ ఎంతగానో మెప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా కి సంబందించిన పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ అన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు లో […]

ట్రైలర్ : మిస్టర్. కేకే....
X

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర లో కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్ గా త్వరలో రానున్న చిత్రం ‘కడరం కొండాన్’.

తమిళంలో ఇప్పటికే సంచలనం రేపుతున్న ఈ సినిమా అందరినీ ఎంతగానో మెప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమా కి సంబందించిన పోస్టర్స్, మోషన్ పోస్టర్స్ అన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు లో ఈ సినిమా కి ”మిస్టర్. కేకే” అనే టైటిల్ ని ఖరారు చేసి, సినిమా కి సంబందించిన తెలుగు ట్రైలర్ ని కూడా నేడు యూట్యూబ్ లోకి వదిలారు.

కమల్ హాసన్ తో 2015 లో చీకటి రాజ్యం అనే సినిమా ని చేసిన రాజేష్ సెల్వం ఈ సినిమా కి దర్శకుడు. దర్శకుడి గా రాజేష్ కి ఇది రెండో సినిమా. కమల్ హాసన్ స్వయం గా ఈ సినిమా ని తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బానర్ పైన భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సినిమా ఆద్యంతం వారు పెట్టిన బడ్జెట్ కళ్ళకి కట్టినట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. అలాగే బ్రహ్మాండమైన విజువల్స్, బ్రిలియన్ట్ కట్స్ తో …. జనాలని థియేటర్ వరకు తీసుకొని వచ్చే విధంగా ఈ సినిమా ట్రైలర్ ను కట్ చేశారనిపిస్తోంది.

అయితే ఈ సినిమా 2011 లో విడుదల అయిన ‘పాయింట్ బ్లాంక్’ అనే సినిమా కి అన్ అఫీషియల్ రీమేక్ అని అంటున్నారు.

First Published:  4 July 2019 4:42 AM GMT
Next Story