ఆర్ఆర్ఆర్ టీమ్ పై మండిపడుతున్న…. ఎన్టీఆర్ ఫ్యాన్స్

రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా రానుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా విషయాలు బయటకి వచ్చినా… సినిమా కి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల పైన నిత్యం అనుమానాలు వస్తూ ఉన్నాయి.

అయితే నేడు సినిమా యూనిట్ రెండు ప్రకటనలు చేసింది. ఒకటేమో సినిమా షూట్ కి సంబంధించింది కాగా మరొకటి రామ్ చరణ్ కి సంబందించిన ఫస్ట్ లుక్ ది.

అల్లూరి సీతారామరాజు జన్మదిన వారోత్సవం సందర్భం గా ఈ సినిమా లో రామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసే అంశాన్ని టీమ్ ప్రస్తావించింది.

అయితే ఎన్టీఆర్ ఫాన్స్ దీని పై కోపం గా ఉన్నారు. ఆల్రెడీ ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎన్టీఆర్ కి సంబంధించిన లుక్ ని విడుదల చేయాలని మే నెలలో ఫ్యాన్స్ ట్వీట్స్ చేసినా పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ముందుగా చరణ్ లుక్ ని విడుదల చేస్తుండడం తో కొంత అసహనానికి గురై టీమ్ ని తిడుతూ ట్వీట్స్ పెడుతున్నారు.

కొందరయితే చరణ్ కి సంబంధించిన లుక్ వస్తుంది కానీ…. తారక్ పక్కన హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు అని గుర్తు చేశారు.