Telugu Global
Cinema & Entertainment

‘ఓ.. బేబీ’ సినిమా రివ్యూ

రివ్యూ: ఓ.. బేబీ రేటింగ్‌: 2.75/5 తారాగణం: సమంత, నాగశౌర్య, రావు రమేష్‌, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్‌, తేజ త‌దిత‌రులు సంగీతం:  మిక్కీ జే మేయర్‌ నిర్మాత: సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్‌, హ్యూన్వూ థామస్ కిమ్, సునితా తాటి దర్శకత్వం: నందినీ రెడ్డి ప్రముఖ కథానాయిక సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది. ఈ సినిమా కి ముందు నుండి పాజిటివ్ టాక్ ఉండటం వలన సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. నందిని రెడ్డి దర్శకత్వం లో ఈ […]

‘ఓ.. బేబీ’ సినిమా రివ్యూ
X

రివ్యూ: ఓ.. బేబీ
రేటింగ్‌: 2.75/5
తారాగణం: సమంత, నాగశౌర్య, రావు రమేష్‌, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్‌, తేజ త‌దిత‌రులు
సంగీతం: మిక్కీ జే మేయర్‌
నిర్మాత: సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్‌, హ్యూన్వూ థామస్ కిమ్, సునితా తాటి
దర్శకత్వం: నందినీ రెడ్డి

ప్రముఖ కథానాయిక సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా ఉంది. ఈ సినిమా కి ముందు నుండి పాజిటివ్ టాక్ ఉండటం వలన సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. నందిని రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా ఈ రోజే విడుదలయింది.

ఈ చిత్రం సమీక్ష విషయానికి వస్తే….

కథ:

బేబీ (లక్ష్మి) ఒక క్యాంటీన్ నడుపుతూ తన బతుకేంటో తనది అన్నట్టు జీవిస్తుంది. ఇంటా, బయటా… ప్రతి విషయం లో బేబీ వైఖరి అందరి కన్నా భిన్నం గా ఉంటుంది. బేబీ అందరి పైనా డామినేషన్ చూపిస్తుంది.

అలా కుటుంబంలో జరిగిన ఒక చిన్న గొడవ వలన… బేబీ ని ఇంటి నుండి తరిమేస్తారు. అయిన వాళ్ళే ఇలా చేశారు అని బాధ పడుతూ బయటకు వచ్చిన బేబీ…. అనుకోకుండా బేబీ (సమంత) శరీరం లోకి ప్రవేశించి మళ్ళీ ఒక జీవితాన్ని ప్రారంభిస్తుంది. మళ్ళీ కుటుంబ సభ్యుల దగ్గరకు చేరుతుంది బేబీ సమంత. వాళ్ళతో కొత్త వ్యక్తి లా కలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? బేబీ సమస్య ఏంటి? అసలు బేబీ ఏం చేయబోతుంది? అనేది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ:

ఈ చిత్రం లో నటించిన అందరిలో సమంత గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. సమంత నటన చాలా బాగుంది. అసలు సినిమా చూస్తున్నంత సేపు మనకి ఆ పాత్ర పోషిస్తున్న నటి కాకుండా ఆ పాత్ర నే కనిపించేంత బాగుంది.

వయసు లో ఉన్న ఒక అమ్మాయి ఎలా ఉంటుందో, ఆ వయసులో ఉండే ఆలోచనలు, ఆశలు…. వాటన్నింటినీ స్టడీ చేసినట్లుగా ఆ పాత్రలో సమంత ఒదిగిపోయింది అని చెప్పొచ్చు.

ఇంతకు ముందు సమంత తన కెరీర్ లో ఎన్నో పాత్రలు చేసింది కానీ…. ఈ బేబీ పాత్ర మాత్రం ప్రత్యేకం అని చెప్పొచ్చు. ప్రతి సీన్లో తన ఎనర్జీ ఏ మాత్రం తగ్గకుండా మెంటైన్ చేసింది సమంత. ముఖ్యం గా ఎమోషనల్ సీన్ల లో సమంత నటన చాలా బాగుంది.

ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ మంచి నటనతో మెప్పించారు. సీనియర్లు అయినా కానీ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని పాత్ర కి కావాల్సిన మేరకు నటించి…. సమంత కి మంచి సహకారం అందించారు.

ముఖ్యం గా రాజేంద్ర ప్రసాద్ పాత్ర లేకుంటే సినిమా లో ఏదో వెలితి ఉండేది అనే భావన కలిగించింది అతని నటన. ఇంకా లక్ష్మి నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆవిడ కూడా ఈ సినిమా లో తన బెస్ట్ ని ఇచ్చారు అని చెప్పవచ్చు. రావు రమేష్ మంచి ఎమోషనల్ పాత్రలో నటించి మెప్పించాడు.

నాగ శౌర్య తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించాడు. తేజ సజ్జా కూడా బాగున్నాడు. మిగిలిన నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు.

సాంకేతిక నింపుణుల పనితీరు:

నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా ఆద్యంతం చాలా బాగా వచ్చేలా కష్ట పడ్డారని అర్ధం అవుతుంది. ఈ సినిమా లో కెమెరా పనితనం చాలా బాగుంది. చాలా చక్కటి విజువల్స్ తో ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు.

సంగీతం ఈ సినిమా కి ప్లస్ అవుతుంది అనుకుంటే, ఒక్క పాట తప్ప మిగిలినవేమీ గుర్తుండవు. సంగీతం తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా కి పెద్దగా ఉపయోగపడలేదు. ఇంకా ఈ సినిమాలో మాటలు బాగున్నాయి. ఒక చక్కటి కథ ని చాలా బాగా ప్రెజెంట్ చేసింది డైరెక్టర్ నందినీ రెడ్డి.

రివ్యూ:

ఈ సినిమా కొరియన్ భాష లో వచ్చిన ‘మిస్ గ్రానీ’ అనే సినిమా కి రీమేక్ అయినప్పటికీ ఎక్కడా నేటివిటీకి తగ్గకుండా దర్శకురాలు నందిని రెడ్డి కథ ని బాగా రాసుకున్నారు.

ఈ సినిమా తో నందిని తన కెరీర్ లో నే బెస్ట్ వర్క్ ని అందించారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సినిమా సెకండ్ హాఫ్ కొంచెం స్లో గా అనిపిస్తుంది. అలాగే నిడివి కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఈ రెండే సినిమా కి మైనస్ పాయింట్లు గా చెప్పొచ్చు.

ఈ సినిమా లో చాలా సన్నివేశాలు మనం ఊహించిన విధంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి…. కొత్తదనం ఉన్నట్లు అనిపించదు. కానీ డైరెక్టర్ నందిని మాత్రం సినిమాని ఆసక్తికరం గా మలచడంతో ఎక్కడా బోర్ కొట్టదు. ఒక చక్కటి కుటుంబ కథ కి మంచి డ్రామా ని యాడ్ చేసి, ఎమోషనల్ గా సినిమా ని తీర్చిదిద్దారు. ఈ సినిమా లో హృదయానికి హత్తుకొనే భావోద్వేగాల తో పాటు, మంచి కథ ఉంది.

చివరగా…. కుటుంబం తో కలిసి చూడదగ్గ చిత్రం ‘ఓ.. బేబీ’.

First Published:  5 July 2019 5:30 AM GMT
Next Story