Telugu Global
NEWS

సచిన్ మరో ప్రపంచ రికార్డు తెరమరుగు

27 ఏళ్ల రికార్డును అధిగమించిన అప్ఘన్ వికెట్ కీపర్  విండీస్ తో పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ లో భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ నెలకొల్పిన మరో రికార్డు తెరమరుగయ్యింది. 27 ఏళ్ల క్రితం జరిగిన 1992 ప్రపంచకప్ లో సచిన్ అత్యంత పిన్నవయసులో నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డును..2019 ప్రపంచకప్ లో అప్ఘనిస్తాన్ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ ఇక్రమ్ అలీ ఖాన్ అధిగమించాడు. 18 ఏళ్ల 332 ఏళ్ల వయసులో సచిన్.. 1992 ప్రపంచకప్ లో […]

సచిన్ మరో ప్రపంచ రికార్డు తెరమరుగు
X
  • 27 ఏళ్ల రికార్డును అధిగమించిన అప్ఘన్ వికెట్ కీపర్
  • విండీస్ తో పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్

ప్రపంచకప్ లో భారత క్రికెటర్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ నెలకొల్పిన మరో రికార్డు తెరమరుగయ్యింది.

27 ఏళ్ల క్రితం జరిగిన 1992 ప్రపంచకప్ లో సచిన్ అత్యంత పిన్నవయసులో నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డును..2019 ప్రపంచకప్ లో అప్ఘనిస్తాన్ వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ ఇక్రమ్ అలీ ఖాన్ అధిగమించాడు.

18 ఏళ్ల 332 ఏళ్ల వయసులో సచిన్..

1992 ప్రపంచకప్ లో సచిన్ టెండుల్కర్ తొలిసారిగా పాల్గొన్న సమయంలో మాస్టర్ వయసు కేవలం 18 ఏళ్ల 332 రోజులు మాత్రమే.

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో సచిన్ ఏకంగా 81 పరుగుల స్కోరు సాధించాడు. అత్యంత పిన్నవయసులో అత్యధిక ప్రపంచకప్ స్కోరు సాధించిన క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. నాటి నుంచి ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ దశ వరకూ సచిన్ పేరుతోనే ప్రపంచ రికార్డు ఉంది.

18 ఏళ్ల 278 రోజుల వయసులో ఇక్రమ్..

లీడ్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన ప్రపంచకప్ ఆఖరిరౌండ్ పోటీలో…వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఇక్రం అలీ ఖాన్..మొత్తం 93 బాల్స్ ఎదుర్కొని 8 బౌండ్రీలతో 86 పరుగులు చేయడం ద్వారా…సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.

ప్రపంచకప్ లో అత్యధిక స్కోరు సాధించిన అత్యంత పిన్నవయసు కలిగిన క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు. 27 ఏళ్ల క్రితం సచిన్ నెలకొల్పిన 81 పరుగుల రికార్డును ఇక్రం 86 పరుగుల స్కోరుతో అధిగమించాడు. ఇక్రం పోరాడినా…తన జట్టును విజేతగా నిలుపలేకపోయాడు.

First Published:  5 July 2019 3:18 AM GMT
Next Story