శ్రీను వైట్ల నెక్స్ట్ సినిమా ఇదేనట…!

దర్శకుడు శ్రీను వైట్ల మొన్నామధ్య రవితేజ తో చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా పరాజయం పాలవడం తో విమర్శకులు గట్టిగానే కామెంట్స్ చేశారు.

దాదాపు గా శ్రీను వైట్ల కెరీర్ ఫుల్ స్టాప్ స్టేజ్ కి వచ్చేసింది అనే టైం కి…. ఇప్పుడు కొత్త సినిమా తో రాబోతున్నాడు అనే వార్త హల్ చల్ చేస్తుంది. అయితే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఆయన తదుపరి సినిమాలో హీరోలు ఒకరు కాదు, ఇద్దరు అని తెలుస్తోంది.

ఢీ సినిమా తో విష్ణు కి, రెడీ సినిమా తో రామ్ కి వైట్ల హిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలని పెట్టుకొని ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట ఈ దర్శకుడు. ఇద్దరినీ పెట్టి ఒక క్రైమ్ కామెడీ చేయాలని అనుకుంటున్నాడట వైట్ల. అయితే వాళ్ళ తో స్టోరీ డిస్కషన్స్ పూర్తి అయ్యాయని…. ఫైనల్ డ్రాఫ్ట్ మీద పని జరుగుతుందని… అది అవ్వగానే పూర్తి సమాచారం బయటకు వస్తుందని తెలుస్తోంది. మరి ఈసారైనా శ్రీను వైట్ల హిట్ కొడతాడో లేదో చూడాలి.