Telugu Global
NEWS

వింబుల్డన్ లో అతిపెద్ద సంచలనం

2వ రౌండ్లోనే చాంపియన్ కెర్బర్ కు షాక్  దూసుకుపోతున్న ఫెదరర్ , జోకోవిచ్ 2019 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో సీడెడ్ స్టార్లు క్వార్టర్ ఫైనల్స్ దిశగా దూసుకుపోతుంటే…మహిళల సింగిల్స్ రెండో రౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. ఆల్ -ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టుల్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో ప్రస్తుత చాంపియన్, 5వ సీడ్ ఏంజెలికో పోటీ.. 2వ రౌండ్లోనే ముగిసింది. లక్కీ లూసర్ గా వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన లారెన్ […]

వింబుల్డన్ లో అతిపెద్ద సంచలనం
X
  • 2వ రౌండ్లోనే చాంపియన్ కెర్బర్ కు షాక్
  • దూసుకుపోతున్న ఫెదరర్ , జోకోవిచ్

2019 వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో సీడెడ్ స్టార్లు క్వార్టర్ ఫైనల్స్ దిశగా దూసుకుపోతుంటే…మహిళల సింగిల్స్ రెండో రౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది.

ఆల్ -ఇంగ్లండ్ క్లబ్ గ్రాస్ కోర్టుల్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో ప్రస్తుత చాంపియన్, 5వ సీడ్ ఏంజెలికో పోటీ.. 2వ రౌండ్లోనే ముగిసింది.

లక్కీ లూసర్ గా వింబుల్డన్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన లారెన్ డేవిస్…రెండోరౌండ్ పోటీలో….డిఫెండింగ్ చాంపియన్ కెర్బరన్ ను మూడు సెట్లలో అధిగమించి…ప్రస్తుత టోర్నీలో అతిపెద్ద సంచలనం నమోదు చేసింది.

250వ ర్యాంకర్ లారెన్ డేవిస్ ..2-6, 6-2, 6-1తో 5వ ర్యాంకర్ ఏంజెలికో కెర్బర్ కు షాకిచ్చింది.

మూడోరౌండ్లో 17వసారి ఫెదరర్

వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మూడోరౌండ్ కు…ఎనిమిదిసార్లు విజేత రోజర్ ఫెదరర్ మూడోసారి చేరి…జిమ్మీ కానర్స్ సరసన నిలిచాడు.

వింబుల్డన్ చరిత్రలో మూడోరౌండ్ కు 17సార్లు చేరిన తొలి ఆటగాడు జిమ్మీ కానర్స్ కాగా…ఫెదరర్ ఇప్పుడు అదే ఘనత సాధించాడు.

రెండోరౌండ్ పోటీలో 3వ సీడ్ ఫెదరర్..బ్రిటీష్ ఆటగాడు జే క్లార్క్ ను 6-1, 7-6, 6-2 తో ఓడించి..మూడోరౌండ్లో అడుగుపెట్టాడు.

తన కెరియర్ లో గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల మూడో రౌండ్ చేరడం ఫెదరర్ కు ఇది 70వసారి కావడం మరో రికార్డుగా నిలిచిపోతుంది.

మరో రెండోరౌండ్ పోటీలో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జోకోవిచ్ సైతం అలవోక విజయం సాధించి…మూడో రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

First Published:  4 July 2019 11:30 PM GMT
Next Story