ప్రపంచకప్ మహిళా ఫుట్ బాల్ లో టైటిల్ సమరం

  • అమెరికాకు నెదర్లాండ్స్ సవాల్ 
  • సెమీస్ లో ఇంగ్లండ్ పై అమెరికా గెలుపు
  • స్వీడన్ పై ఎక్స్ ట్రా టైమ్ గోల్ తో నెగ్గిన నెదర్లాండ్స్

ఫ్రాన్స్ వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న 2019 పీఫా ప్రపంచకప్ మహిళా ఫుట్ బాల్ టోర్నీ తుది అంకానికి చేరింది. నీస్ సాకర్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ అమెరికాకు …అండర్ డాగ్ నెదర్లాండ్స్ సవాల్ విసురుతోంది.

హోరాహోరీగా సాగిన సెమీస్ సమరంలో సంచలనాల ఇంగ్లండ్ ను అమెరికా 2-1 గోల్స్ తో అధిగమించి…వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

రెండో సెమీఫైనల్లో నెదర్లాండ్స్…ఎక్స్ ట్రా టైమ్ గోల్ తో స్వీడన్ పై నెగ్గి టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

ఆట మొత్తం 90నిముషాలలో ఏ జట్టూ గోల్ చేయలేకపోడంతో…అదనపు సమయానికి పొడిగించారు. ఆట 99వ నిముషంలో డచ్ ప్లేయర్ జాకీ గ్రూనెన్ విజయానికి అవసరమైన గోల్ సాధించింది.

సూపర్ సండే టైటిల్ ఫైట్ లో హాట్ ఫేవరెట్ అమెరికాతో నెదర్లాండ్స్ తలపడనుంది. కాంస్య పతకం కోసం జరిగే పోటీలో ఇంగ్లండ్, స్వీడన్ తలపడతాయి.

నాలుగేళ్ల క్రితం ముగిసిన 2015 ప్రపంచకప్ టోర్నీలో అమెరికా, జపాన్ మొదటి రెండుస్థానాలు సాధించగా…ఇంగ్లండ్, జర్మనీ మూడు, నాలుగు స్థానాలలో నిలిచాయి.