Telugu Global
NEWS

చంద్రబాబు ఆరో కేటగిరిలో ఉన్నారు- విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. లోకేష్ వరుస ట్వీట్ల పైనా స్పందించారు. తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన విజయసాయిరెడ్డి…. కొత్తగా దాడి నాటకానికి చంద్రబాబు ఏమైనా ప్లాన్ చేశారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. జైలుకు పంపుతారేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి కేసుల్లో లోపల వేస్తరేమోనని అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తొస్తుంది. తనను […]

చంద్రబాబు ఆరో కేటగిరిలో ఉన్నారు- విజయసాయిరెడ్డి
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. లోకేష్ వరుస ట్వీట్ల పైనా స్పందించారు. తనకు ఏమైనా జరిగితే రాష్ట్రాన్ని కంట్రోల్ చేయలేరన్న చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన విజయసాయిరెడ్డి…. కొత్తగా దాడి నాటకానికి చంద్రబాబు ఏమైనా ప్లాన్ చేశారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. జైలుకు పంపుతారేమోనన్న అనుమానం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు తన భద్రత గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు.

లోకేష్‌ను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను చేసేందుకు జాకీలు పెట్టి లేపుతున్నారన్నారు. అందులో భాగంగానే తండ్రి సైగ చేయగానే ట్విట్టర్ లో లోకేష్‌ నవ్వులు పూయిస్తున్నారన్నారు.

ఇప్పటి వరకు ప్రపంచ మనుషుల్లో గుర్తించిన ఫోబియాలను ఐదు రకాలుగా విభజించారని… కానీ చంద్రబాబు మానసిక స్థితి ఆరో కేటగిరిలో ఉందన్నారు. అందుకే ఎక్కడేం జరిగినా రాష్ట్రాన్ని కడప, పులివెందులలాగా మారుస్తున్నారంటూ అకారణ భీతిని వ్యక్తం చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

First Published:  6 July 2019 3:39 AM GMT
Next Story