Telugu Global
Cinema & Entertainment

'కొబ్బరి మట్ట' కామెడీ కి రెడీ అవ్వండి

హృదయ కాలేయం సినిమా తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నుండి అలాంటి మరొక సినిమా రాలేదు. ఇప్పటి వరకు మళ్ళీ ఆ రేంజ్ లో సంపూర్ణేష్ హిట్ అందుకోలేదు. అడపాదడపా కొన్ని సినిమాల్లో పాత్రలు చేసినా అవేవీ హృదయ కాలేయం రేంజ్ వి కావు. అందుకే త్వరలో కొబ్బరి మట్ట అనే సినిమా తో సంపూర్ణేష్ బాబు మన ముందుకు రానున్నాడు. అప్పుడెప్పుడో మొదలయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, మెల్ల మెల్ల గా నిర్మాణాంతర కార్యక్రమాలని […]

కొబ్బరి మట్ట కామెడీ కి రెడీ అవ్వండి
X

హృదయ కాలేయం సినిమా తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నుండి అలాంటి మరొక సినిమా రాలేదు. ఇప్పటి వరకు మళ్ళీ ఆ రేంజ్ లో సంపూర్ణేష్ హిట్ అందుకోలేదు.

అడపాదడపా కొన్ని సినిమాల్లో పాత్రలు చేసినా అవేవీ హృదయ కాలేయం రేంజ్ వి కావు. అందుకే త్వరలో కొబ్బరి మట్ట అనే సినిమా తో సంపూర్ణేష్ బాబు మన ముందుకు రానున్నాడు.

అప్పుడెప్పుడో మొదలయ్యి, షూటింగ్ పూర్తి చేసుకొని, మెల్ల మెల్ల గా నిర్మాణాంతర కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ సినిమా కి ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. ఈ సినిమా ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.

ఈ సినిమా విజయం సాధిస్తే సంపూర్ణేష్ మళ్ళీ విజయ పథం లో కి వస్తాడు. ప్రస్తుతం గాడి తప్పిపోయిన సంపూర్ణేష్ బాబు కి ఈ సినిమా విజయం అత్యవసరం. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం లో ఈ సినిమా ని హృదయ కాలేయం సినిమా ని డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ నిర్మించారు.

ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుకు రానున్న ఈ సినిమా లో సంపూర్ణేష్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు.

First Published:  5 July 2019 9:07 PM GMT
Next Story