Telugu Global
Cinema & Entertainment

టీజర్ తో ఆకట్టుకుంటున్న 'సవారీ'

‘100% లవ్’, ‘పెళ్లిచూపులు’, ‘జయజానకినాయక’ వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన నందు హీరోగా మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతున్నాడు. ఇప్పటికే హీరోగా బోలెడు డిజాస్టర్లు చవిచూసిన నందు తాజాగా ‘సవారీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయం పై క్లారిటీ ఇచ్చిన టీజర్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నందు ఈ సినిమాలో […]

టీజర్ తో ఆకట్టుకుంటున్న సవారీ
X

‘100% లవ్’, ‘పెళ్లిచూపులు’, ‘జయజానకినాయక’ వంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన నందు హీరోగా మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోతున్నాడు. ఇప్పటికే హీరోగా బోలెడు డిజాస్టర్లు చవిచూసిన నందు తాజాగా ‘సవారీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ మధ్యనే ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. సినిమా కథ ఎలా ఉండబోతోంది అనే విషయం పై క్లారిటీ ఇచ్చిన టీజర్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నందు ఈ సినిమాలో రాజు అనే ఒక గుర్రపు స్వారీ చేసే వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు.

గుర్రం నడుపుకునే రాజు (నందు) భాగి (ప్రియాంక శర్మ) తో ప్రేమలో పడతాడు. దీని కంటే ముందే భాగి… శాండీ అనే కుర్రాడి తో బ్రేకప్ చెప్తుంది. బ్రేకప్ తర్వాత కూడా శాండీ తనను వెంటాడుతుండటంతో భాగి… రాజు ని తన బాయ్ ఫ్రెండ్ గా శాండీ కి పరిచయం చేస్తుంది.

మధ్యలో ఖాళీ అండ్ గ్యాంగ్ వీరి ప్రేమ కథ లోకి వస్తారు. వారి మధ్య ఏం జరిగింది? అనేది ఈ సినిమా కథ.

బంధం రేగడ్ అనే ఇండిపెండెంట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన సాహిత్ మోత్కూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ యాసలో మాట్లాడుతున్న నందు ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

First Published:  6 July 2019 4:27 AM GMT
Next Story