Telugu Global
NEWS

స్టేడియంపై విమానం చక్కర్లు

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్‌ మ్యాచ్‌ల సందర్భంగా స్డేడియంపై విమానాల చక్కర్లు కలకలం రేపుతున్నాయి. పాక్, ఆఫ్ఘన్‌ మ్యాచ్‌ సందర్భంగా స్డేడియంపై ఒక విమానం వెళ్లింది. జస్టిస్ ఆఫ్‌ బెలూచిస్తాన్ అన్న బ్యానర్‌తో ఈ విమానం స్డేడియంపై వెళ్లింది. నిన్న శ్రీలంక- భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది. ఏకంగా మూడు విమానాలు భారత వ్యతిరేక బ్యానర్లు కట్టుకుని స్డేడియం మీదుగా వెళ్లాయి. కశ్మీర్‌కు న్యాయం చేయండి అంటూ ఒక విమానం, ”జాతి విధ్వంసాన్ని […]

స్టేడియంపై విమానం చక్కర్లు
X

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ప్రపంచ క్రికెట్ కప్‌ మ్యాచ్‌ల సందర్భంగా స్డేడియంపై విమానాల చక్కర్లు కలకలం రేపుతున్నాయి. పాక్, ఆఫ్ఘన్‌ మ్యాచ్‌ సందర్భంగా స్డేడియంపై ఒక విమానం వెళ్లింది. జస్టిస్ ఆఫ్‌ బెలూచిస్తాన్ అన్న బ్యానర్‌తో ఈ విమానం స్డేడియంపై వెళ్లింది. నిన్న శ్రీలంక- భారత్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ అదే జరిగింది.

ఏకంగా మూడు విమానాలు భారత వ్యతిరేక బ్యానర్లు కట్టుకుని స్డేడియం మీదుగా వెళ్లాయి. కశ్మీర్‌కు న్యాయం చేయండి అంటూ ఒక విమానం, ”జాతి విధ్వంసాన్ని భారత్ ఆపాలి… కశ్మీర్‌కు విముక్తి కల్పించండి” అంటూ మరో విమానం స్డేడియం మీదుగా వెళ్లింది. ”మూకదాడులను అరికట్టాలి” అని మరో విమానం స్డేడియం మీదుగా వెళ్లింది.

సహజంగా మ్యాచ్ ఆడుతున్నప్పుడు స్డేడియంపై విమానాలు వెళ్తే కెమెరాలన్నీ అటు వైపు మళ్లడంతో…. ప్రపంచ దృష్టిని ఆకర్షించవచ్చన్న ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.

అయితే మ్యాచ్‌లు నడుస్తున్న సమయంలో విమానాలు ఇలా దేశాలకు వ్యతిరేకంగా బ్యానర్లు కట్టుకుని స్డేడియంపై చక్కర్లు కొట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది భద్రతా వైఫల్యంగా భావిస్తున్నారు.

First Published:  6 July 2019 10:10 PM GMT
Next Story