Telugu Global
Cinema & Entertainment

బందోబస్త్ టీజర్ రివ్యూ

సూర్య కొత్త సినిమా రెడీ అయింది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బందోబస్త్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బందోబస్త్ తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది. కేవలం హీరో ఇంట్రడక్షన్ కే పరిమితం చేయకుండా.. సూర్యతో పాటు ఆర్య, సాయేషా, బొమన్ ఇరానీ లాంటి కీలక పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేసి సినిమాపై ఇంట్రెస్ట్ జనరేట్ […]

బందోబస్త్ టీజర్ రివ్యూ
X

సూర్య కొత్త సినిమా రెడీ అయింది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బందోబస్త్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బందోబస్త్ తెరకెక్కిందనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది. కేవలం హీరో ఇంట్రడక్షన్ కే పరిమితం చేయకుండా.. సూర్యతో పాటు ఆర్య, సాయేషా, బొమన్ ఇరానీ లాంటి కీలక పాత్రల్ని కూడా టీజర్ లో పరిచయం చేసి సినిమాపై ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేలా చేయగలిగారు.

దేశ ద్రోహుల నుండి దేశాన్ని కాపాడే అండర్ కవర్ కాప్ గా సూర్య పాత్ర కనిపిస్తుంది. ఆయన దేశరక్షణ కోసం రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఇక మోహన్ లాల్ దేశ ప్రధాని పాత్రలో.. బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ స్వార్థపూరిత బిజినెస్ మెన్ గా కనిపిస్తున్నారు. మరో రెండు కీలక పాత్రల్లో సయేశా, ఆర్య కనిపిస్తున్నారు. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయబోతున్నారు.

First Published:  7 July 2019 12:31 AM GMT
Next Story