Telugu Global
NEWS

తానా సభల్లో పవన్‌ సందేశ సారాంశం ఇదేనా?

ఏపీలో ఎన్నికలు ముగిసి రెండు నెలలు కూడా కాకముందే రాజకీయ శక్తుల పునర్‌ ఏకీకరణ మొదలైంది. ఏపీలో సునామీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు… పాలనలో వేగంగా ముందుకెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌గా రాజకీయం మొదలైంది. ఇందుకు తానా సభలు ప్రధాన వేదిక అయ్యాయి. ఈసారి తానాలో స్పష్టంగా కొన్ని అంశాలు కనిపించాయి. వైసీపీని తానా పెద్దలు దాదాపు దూరంగా ఉంచారు. వైసీపీలో కొందరికి తానా ఆహ్వానాలు పంపినా వారు కూడా వెళ్లేందుకు విముఖత చూపారు. […]

తానా సభల్లో పవన్‌ సందేశ సారాంశం ఇదేనా?
X

ఏపీలో ఎన్నికలు ముగిసి రెండు నెలలు కూడా కాకముందే రాజకీయ శక్తుల పునర్‌ ఏకీకరణ మొదలైంది. ఏపీలో సునామీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు… పాలనలో వేగంగా ముందుకెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి టార్గెట్‌గా రాజకీయం మొదలైంది. ఇందుకు తానా సభలు ప్రధాన వేదిక అయ్యాయి. ఈసారి తానాలో స్పష్టంగా కొన్ని అంశాలు కనిపించాయి. వైసీపీని తానా పెద్దలు దాదాపు దూరంగా ఉంచారు.

వైసీపీలో కొందరికి తానా ఆహ్వానాలు పంపినా వారు కూడా వెళ్లేందుకు విముఖత చూపారు. ఇందుకు ప్రధాన కారణంగా తానా సభల్లో డామినేషన్ మొత్తం చంద్రబాబు కులానిదే కావడం. తానాకి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో అత్యధికులు కమ్మవారే, ఇతర వర్గాల వారు కొందరు ఉన్నా… డామినేషన్‌, నిర్ణయాధికారం అంతా చంద్రబాబు కులస్తులదే. చంద్రబాబును జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా ఓడించిన నేపథ్యంలో తానా పెద్దలకు వైసీపీ అంటే అస్సలు పడడం లేదని చెబుతున్నారు.

తానా సభలకు ఒకరిద్దరు మినహాయిస్తే వైసీపీ నుంచి ఎవరూ వెళ్లలేదు. అలా వెళ్లిన వైసీపీ వారిలోనూ కమ్మ సామాజికవర్గం వారే కావడం విశేషం. ఇది వరకే తానాపై కుల ముద్ర బలంగా ఉన్నా… ఈసారి ఆ ముద్ర మరింత బలంగా కనిపించింది. అసలు వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తుల ఏకీకరణకు వేదికగా మారిన తానా సభలకు వెళ్లిన వైసీపీ నేతలు ఎవరు అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వెళ్లిన వైసీపీ నేతల పేర్లను పలువురు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు పవన్‌ కల్యాణ్ తానా సభలకు వెళ్లడం వెనుక ప్రత్యేక కారణం ఉందని భావిస్తున్నారు.

తానా సభలకు వెళ్లడం ద్వారా భవిష్యత్తులో టీడీపీ వైపు తాను ఉండబోతున్నానని… మీరు కూడా అందుకు సిద్ధపడండి అన్నట్టుగా తన వర్గానికి పవన్‌ కల్యాణ్ సందేశం ఇచ్చినట్టుగా ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తానా వేదికగా పవన్ కల్యాణ్‌ చేసిన ప్రసంగం కూడా టార్గెట్ జగన్‌ గానే ఉండడాన్ని ప్రస్తావిస్తున్నారు. కమ్మ డామినేషన్‌ ఉండే తానా సభలకు అతిథిగా వెళ్లడం ద్వారా కాపులను తిరిగి టీడీపీ భుజం కాయాల్సిందిగా పవన్‌ కల్యాణ్ వెల్లడించినట్టు ఉందని అభిప్రాయపడుతున్నారు.

First Published:  7 July 2019 5:00 AM GMT
Next Story